Site icon NTV Telugu

Vijayawada: బెజవాడలో 10 మంది ఉగ్రవాదులు?.. ఉగ్ర కదలికలపై పోలీసుల ఆరా..

Kashmiri Terrorist

Kashmiri Terrorist

బెజవాడలో ఉగ్ర కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సిమి(SIMI) సానుభూతి పరుల గురించి 2 నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాల నుంచి బెజవాడ పోలీసులకు సమాచారం అందింది. కేంద్ర నిఘా సంస్థ నలుగురు అనుమానితులు గురించి సమాచారం ఇచ్చింది. మరో ఆరుగురు అనుమానితులను స్థానిక పోలీసులు గుర్తించారు. మొత్తం 10 మంది కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. 10 మంది గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బీపేట ప్రాంతాల్లో వేర్వేరు పనులు చేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు ఏ కార్యక్రమాలు చేయటం లేదని నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా మావోయిస్తులకి షెల్టర్ జోన్‌గా బెజవాడ నిలిచింది.

READ MORE: Nehal Wadhera: విరాట్ నా పేరు గుర్తు పెట్టుకోవడమా.. షాక్‌కు గురయ్యా!

Exit mobile version