Polavaram Election Results 2026: పోలవరం జిల్లాలో భిన్నమైన ప్రజాతీర్పు.. వైసీపీ, కూటమి హోరాహోరీ!

Tdp Vs Ycp

Tdp Vs Ycp

Polavaram Election Results 2026: పోలవరం జిల్లాలో పరిషత్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ ఆధిక్యం సాధించగా.. ఎంపీటీసీ స్థానాల్లో మాత్రం టీడీపీ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 12 జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఐదు స్థానాలు కైవసం చేసుకోగా.. టీడీపీ నాలుగు, జనసేన రెండు, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. ఇక 101 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 41 స్థానాలతో మొదటి స్థానంలో నిలవగా.. వైసీపీ 40 స్థానాలతో గట్టి పోటీ ఇచ్చింది. కేవలం ఒక్క స్థానం తేడాతో ఇరు పార్టీలు నిలవడం పోలవరం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కూటమిలో జనసేన 8, బీజేపీ 4 దక్కించుకున్నాయి. దీంతో జడ్పీటీసీల్లో వైసీపీ ఆధిక్యం.. ఎంపీటీసీల్లో కూటమి ఆధిపత్యం చెలాయించింది.

పోలవరం జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకు కొత్త సంకేతాలిచ్చాయి. జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఐదు స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలు, జనసేన రెండు స్థానాలు, బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. మరోవైపు ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం పోటీ హోరాహోరీగా సాగింది. మొత్తం 101 స్థానాలకు గాను టీడీపీ 41 స్థానాలు సాధించగా.. వైసీపీ 40 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. జనసేన ఎనిమిది, బీజేపీ నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి. వామపక్షాల్లో సీపీఎం ఐదు, సీపీఐ ఒక స్థానం సాధించగా.. కాంగ్రెస్ ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు.

ఎంపీటీసీ ఫలితాల్లో టీడీపీ, వైసీపీల మధ్య కేవలం ఒక్క స్థానం మాత్రమే తేడా ఉండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జడ్పీటీసీల్లో వైసీపీ ముందంజలో ఉన్నప్పటికీ.. ఎంపీటీసీల్లో టీడీపీ ఆధిక్యం సాధించడం గమనార్హం. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి 53 ఎంపీటీసీ స్థానాలు సాధించాయి. జడ్పీటీసీల్లోనూ ఈ మూడు పార్టీలు కలిపి ఏడు స్థానాలు గెలుచుకున్నాయి. దాంతో పోలవరం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు భిన్నమైన రాజకీయ తీర్పును ఇచ్చాయి. గ్రామీణ స్థాయిలో వైసీపీ తన పట్టును కొంతమేర నిలబెట్టుకోగా.. కూటమి పార్టీలు ఎంపీటీసీ స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించాయి. ఈ ఫలితాలు రానున్న రోజుల్లో జిల్లా రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.