NTV Telugu Site icon

Pola Bhaskar: ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పోలా భాస్కర్..

New Project (14)

New Project (14)

ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పోలా భాస్కర్ ను నియమించింది. కాలేజ్ విద్య కమిషనర్ పోలా భాస్కర్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జే. శ్యామలరావు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా నియమితులైన సంగతి తెలిసిందే. టీటీడీ ఈవోగా ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ఏపీ ప్రభుత్వం తొలగించింది. దీంతో ఖాళీ ఏర్పడటంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

READ MORE: Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై యువకుల రాళ్ల దాడి..

కాగా.. ఏపీ ప్రభుత్వ విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. నిన్న ఉండవల్లిలోని తన నివాసంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఉన్నత విద్యశాఖ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలను సమర్పించాలని రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. విద్య శాఖ ముఖ్య అధికారుల సమావేశంలో లోకేష్ మాట్లాడారు. తాను పాదయాత్ర నిర్వహించిన సమయంలో వేలాది విద్యార్థులు ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల తమ సర్టిఫికెట్లు కళాశాలల్లోనే నిలిచిపోయాయని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2018-19 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్ల వివరాలు, ఎప్ సెట్ లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజి ఏమేరకు ఇవ్వాలి, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు ఏమేరకు ఉండాలనే విషయమై కూడా నోట్ సమర్పించాలని లోకేష్ కోరారు. ఉన్నత విద్యాసంస్థల్లో ఖాళీలు, రిక్రూట్ మెంట్ చేయాల్సిన ఫ్యాకల్టీ వివరాలు, రాష్ట్రవిభజనలో ఉన్నత విద్యకు సంబంధించిన పెండింగ్ అంశాలు, లెర్నింగ్ మ్యానేజ్ మెంట్ సిస్టమ్ ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశాలపై పూర్తిస్థాయి నివేదికలు అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.