Killer whales: జపాన్ లో రికార్డు స్థాయిలో హిమపాతం.. చిక్కుకుపోయిన కిల్లర్ వేల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japan: జపాన్‌లో ఇటీవల రికార్డు స్థాయి హిమపాతం మొదలు కావడంతో అరుదైన కిల్లర్ వేల్స్ (Arkas)కు ప్రాణాల మీదకు వచ్చింది. ఉత్తర జపాన్‌లోని హక్కైడో తీరంలో గల రౌస్ అనే ప్రదేశానికి కిలో మీటరు దూరంలో గడ్డకట్టిన నీటి మధ్య చిన్న ఖాళీ ప్రాంతంలో దాదాపు 10 కిల్లర్ వేల్స్ చిక్కుకున్నాయి. ఇవి కదలడానికి జాగా లేకపోవడంతో.. తలలను నీటి బయటపెట్టి శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలను జపాన్ జాతీయ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది. ఆ మూగజీవాలు గాలి ఆడకపోవడంతో నానా అవస్థ పడుతున్న తీరు చూసి జంతుప్రేమికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. కిల్లర్ వేల్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏటా రౌస్ దగ్గరకు పెద్ద ఎత్తున పర్యటకులు వెళ్తుంటారు.
Read Also: Dunki : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘డంకీ’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Also Read
- Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్‌గా పశ్చిమాసియా
- Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
- Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
- Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. టన్నుకు రూ.351 పెంపు..
అయితే, ఈ దృశ్యాలను చూసిన కొందరు మత్స్యకారులు అధికారులను అలర్ట్ చేశారు. ఆర్కాస్‌ను రక్షించేందుకు అక్కడకు చేరుకోవడం కోస్టుగార్డ్ సిబ్బందికి తీవ్ర ఇబ్బందిగా మారింది. అక్కడి నీరు మొత్తం గడ్డ కట్టిపోయింది. మంచు కరిగిపోయే వరకు తాము ఏమీ చేయలేమని అధికారులు తెలిపారు. అలాగే, 2005లో కూడా ఇలానే మంచులో ఆర్కాస్ చిక్కుకుపోయి ప్రాణాలను కోల్పోయాయి. ఆ ఘటన కూడా రౌస్ సమీపంలోనే జరిగింది. ఉత్తరార్ధ గోళంలో లోతట్టు ప్రాంతంగా హక్కైడోను పేర్కొంటారు. గతంలో ఇక్కడ భారీగా మంచు గడ్డకట్టి ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.
తాజావార్తలు
-
Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్‌గా పశ్చిమాసియా
-
CM Vijay Tiruchi Speech: తన డ్రెస్సింగ్ స్టైల్‌పై ట్రోల్స్ చేసినోళ్లకు సీఎం విజయ్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. !
-
Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
-
Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
-
Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. టన్నుకు రూ.351 పెంపు..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!