Site icon NTV Telugu

Hyderabad: ప్రేమించి మోసం చేసిన యువతి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్..

Man Suicide

Man Suicide

Hyderabad: ప్రేమించిన యువతి మోసం చేసిందనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ రెడ్డి(26) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ యువతి ప్రేమించి మోసం చేసిందనే కారణంతో పవన్ కళ్యాణ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. గుంటూరు జిల్లా సంగడిగుంట ఐపీడీకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కుర్రా శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పవన్ కళ్యాణ్ రెడ్డి.. అతడు పోచారం ఇన్ఫోసిస్ సమీపంలోని సంస్కృతి టౌన్షిప్ లో స్నేహితులతో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటూ నాలుగేళ్లుగా ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.

READ MORE: Champion : ‘ఛాంపియన్’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. రోషన్–అనస్వర కెమిస్ట్రీ హైలైట్!

పవన్ కళ్యాణ్ ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరు పెళ్లి చేసు కుంటామనే ఉద్దేశంతో శారీరకంగా దగ్గరైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం యువతి గచ్చిబౌలిలో ప్రైవేటు వసతి గృహంలో ఉంటున్నట్లు సమాచారం.. ఆ యువతి వద్ద వేరే వ్యక్తి ఫొటోలు, అతనితో ఉన్న ఫొటో చూసి పవన్ కళ్యాణ్ రెడ్డి అనుమానం పెంచుకున్నాడు. సదరు ఫొటోలను యువతి కుటుంబ సభ్యులకు పంపించాడు. విషయం తెలుసుకున్న ఆమె గచ్చిబౌలి పీఎస్‌లో పవన్ కళ్యాణ్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. రెండు రోజులుగా ఆమెకు ఫోన్ చేస్తున్నా స్పందించక పోవడంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్నేహితులు అతని తండ్రికి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు నగరానికి వచ్చారు. ప్రేమించిన యువతి మోసగించిందనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version