NTV Telugu Site icon

PM Modi: ఆస్ట్రేలియా పర్యటనలో మోడీ.. ఆకాశంలో గ్రాండ్ వెల్కమ్

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆయన నేడు రాజధాని సిడ్నీలో బిజీ షెడ్యూల్లో గడపనున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి ఘన స్వాగతం లభించింది. విమానాల సహాయంతో ప్రధానికి స్వాగతం పలికేందుకు ఆకాశంలో ‘వెల్‌కమ్ మోడీ’ అని రాశారు. ప్రధానమంత్రిగా ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ప్రధాని అంతకుముందు పాపువా న్యూ గినియాలో ఉన్నారు. అక్కడ ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే ఆయన పాదాలను తాకారు. అదే సమయంలో, జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశానికి చేరుకున్న జో బిడెన్ ప్రధానమంత్రి ఆటోగ్రాఫ్ అడిగారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సిడ్నీలో ఆస్ట్రేలియన్ సూపర్ సీఈఓ పాల్ ష్రోడర్, ఫోర్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆండ్రూ ఫారెస్ట్, హాన్‌కాక్ ప్రాస్పెక్టింగ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గినా రైన్‌హార్ట్‌లతో సమావేశం కానున్నారు. వీరితో పాటు ఆస్ట్రేలియాలోని కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులతో కూడా ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.

Read Also:Balakrishna: ఊహించని కాంబినేషన్.. బాలయ్య, రజనీ, శివకుమార్.. బాక్సాఫీస్ బద్దలే

సిడ్నీ స్టేడియంలో ప్రధాని మోదీ కార్యక్రమం
సిడ్నీలోని కుడోస్ బ్యాంక్ ఎరీనా స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. ఇక్కడ ఆయన భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా హాజరుకానున్నారు. సమాచారం ప్రకారం.. ఈ 20 వేల సీటింగ్ స్టేడియం టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఇండియన్ ఆస్ట్రేలియన్ డయాస్పోరా ఫౌండేషన్ ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ ఫౌండేషన్ డైరెక్టర్లు జై షా, రాహుల్ జెథి అని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌ను ఉటంకిస్తూ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

Read Also:Godavari River: విషాదం.. గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు

సిడ్నీకి చేరుకున్న ఏకైక క్వాడ్ నాయకుడు ప్రధాని మోదీ
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో క్వాడ్ నాయకుల సమావేశ షెడ్యూల్ ఉంది. మే 24న జరగనున్న సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కూడా ఇక్కడికి చేరుకోనున్నారు. అయితే అమెరికాలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం… రుణ పరిమితిపై చర్చలు జరగడంతో ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకున్నారు. బిడెన్ తర్వాత, ఫ్యూమియో కిషిడా కూడా తన పర్యటనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జీ7 సదస్సు సందర్భంగానే క్వాడ్ నేతలు సమావేశమయ్యారు.

Show comments