NTV Telugu Site icon

Paralympics 2024: దేశం గర్విస్తోంది.. పారాలింపిక్ విజేతలతో ప్రధాని మోదీ..

Pm

Pm

Paralympics 2024: ప్రస్తుతం ప్యారిస్ లో జరుగుతున్న పారా పారాలింపిక్స్ 2024 క్రీడలలో భారతీయ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. మంగళవారం నాటికి మొత్తం 20 మెడల్స్ తో టేబుల్ లిస్టులో 19వ స్థానంలో ఇండియా కొనసాగుతోంది. ఇందులో మూడు స్వర్ణ పతకాలు, ఏడో రజత పతకాలు, 10 కాంస్య పతకాలను సాధించారు క్రీడాకారులు. ఇకపోతే ప్రస్తుతం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింగపూర్, బ్రూనై దేశాలలో మూడు రోజుల పర్యటనలో భాగంగా పర్యటిస్తున్నారు. మంగళవారం నాడు బ్రూనై యువరాజు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రస్తుతం ప్యారిస్ లో జరుగుతున్న పారాలింపిక్ క్రీడలలో అద్భుత విజయం సాధించిన ఆటగాళ్లకు నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Paris Paralympics 2024: టోక్యో రికార్డు బ్రేక్.. పారాలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే!

పతకాలు గెలిచిన ఆటగాళ్లతో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడిన సమాచారాన్ని ప్రధాని స్వయంగా తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. యోగేష్ కథునియా, సుమిత్ ఆంటిల్, శీతల్ దేవి, రాకేష్ కుమార్‌ క్రీడాకారుల అందరితో ఆయన మాట్లాడి వారిని అభినందించారు. ఇందులో భాగంగా ప్రధాని మాట్లాడుతూ.. భారతదేశం తన క్రీడాకారులను చూసి గర్విస్తోంది అంటూ కొనియాడారు. యోగేష్ తో ప్రధాని మాట్లాడుతూ.. అతని తల్లి పరిస్థితి గురించి ఆయన సమాచారాన్ని తెలుసుకొని.. ఆమె గర్భాశయ వ్యాధిపై కూడా అప్డేట్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యోగేష్ మాట్లాడుతూ.. మీరు బ్రూనై లో ఉన్న గాని తమ గురించి ఆరా తీస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అందుకు ధన్యవాదాలు అంటూ తెలిపాడు. దానికి ప్రధాని మాట్లాడుతూ.. తాను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే భారతదేశంలోనే తన ఆలోచనలు ఉంటాయని తెలిపారు.

Show comments