మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన జరగనుంది. జూన్ 20–21 తేదీల్లో బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. బీహార్‌లోని సివాన్ జిల్లాలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు రూ. 400 కోట్ల విలువైన వైశాలీ–దియోరియా రైలు మార్గం ప్రారంభిస్తారు. పట్నా–గోరఖ్‌పూర్ మధ్య “వందే భారత్” ఎక్స్‌ప్రెస్ ను స్టార్ట్ చేస్తారు.మార్హౌరా ప్లాంట్ లో తయారైన తొలి “లోకోమోటివ్ రైలు ఇంజిన్” ను గినియా దేశానికి ఎగిమతి కార్యక్రమంలో ప్రధాన పాల్గొంటారు. “నమామి గంగే” కింద రూ. 1800 కోట్లతో 6 శుద్ధి కేంద్రాల ప్రారంభిస్తారు. రూ. 3000 కోట్లతో నీటి సరఫరా, మురుగు శుద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. బీహార్‌లో 500 MWh సామర్థ్యంతో “బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్” ప్రారంభిస్తారు. అలాగే.. బీహార్ లో 53,600 మంది “ప్రధానమంత్రి ఆవాస్ యోజన- పట్టణ ప్రాంత” లబ్ధిదారులకు మొదటి విడత నిధుల విడుదల చేస్తారు. 6,600 మంది లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరవుతారు.
READ MORE: Keerthy Suresh : తడబడకుండా ‘ఉప్పుకప్పురంబు’ పద్యం చెప్పిన కీర్తిసురేష్..
ఒడిస్సా పర్యటనలో ప్రధాని కీలక కార్యక్రమాలు..
అనంతరం.. మోడీ ఒడిశాకు వెళ్తారు. ఒడిస్సా ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మధ్యాహ్నం 4.15 నిమిషాలకు రాష్ట్రస్థాయి బీజేపీ నేతల సమావేశానికి సభాధ్యక్షత వహిస్తారు. రూ .18,600 కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బౌద్ జిల్లా లో తొలిసారిగా రైలు మార్గంతో పాటు, కొత్త రైలు ప్రారంభిస్తారు. భువనేశ్వర్‌లో “రాజధాని ప్రాంత పట్టణ రవాణా పధకం”(CRUT) కింద 100 ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రఖ్యాత ఒడియా వ్యక్తుల జన్మస్థలాల అభివృద్ధి ప్రోగ్రాం, 16.5 లక్షల ‘లక్షపతి దిద్దీలను’ సత్కరించే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు.
READ MORE: Bomb Threat: గాడియం ఇంటర్నేషనల్ స్కూలుకు బాంబు బెదిరింపు..
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీ పర్యటన..
ఒడిశా పర్యటన అనంతరం జూన్ 20 సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ రాత్రికి బస చేస్తారు. జూన్ 21 న ఉదయం 6.30 గంటలకు విశాఖపట్నంలో నిర్వహించే “అంతర్జాతీయ యోగా దినోత్సవం” కార్యక్రమంలో పాల్గొంటారు. సముద్ర తీరం వద్ద 5 లక్షల మందితో కలిసి “మాస్ యోగా డెమో” నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 3.5 లక్షల కేంద్రాల్లో “యోగా సంఘ సంయోజిత” కార్యక్రమాలు జరపనున్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం” (IDY2025 థీమ్) నేపథ్యంతో సాగనుంది. “మై గవర్నమెంట్, మైభారత్ ప్లాట్‌ఫార్మ్‌లపై యువత కోసం “Yoga with Family”, “Yoga Unplugged” పోటీలను ప్రారంభించింది.
