Site icon NTV Telugu

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. నేడే ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ డబ్బులు..

Pm Kisan

Pm Kisan

కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు నేడు బ్యాంకు ఖాతాల్లో జమ కాబోతున్నాయి. 15వ విడత కింద అర్హులైన దాదాపు 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో దాదాపు 2000 రూపాయల చొప్పున జమ చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఝార్ఖండ్ లోని కుంటిలో ఇవాళ (బుధవారం) ఉదయం 11:30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నిధులు విడుదల చేస్తారని పేర్కొనింది.

Read Also: Revanth Reddy: నేడు మూడు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటన.. షెడ్యూల్‌ ఇదే..

ఇక, ఎవరైతే ఈ-కేవైసీ పూర్తి చేశారో వారి ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధులు జమ కానున్నాయి. దేశవ్యాప్తంగా రైతులకు లబ్ధి జరిగేలా మోడీ సర్కార్ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఈ పథకాన్ని అమలు చేస్తోంది. సంవత్సరానికి మూడు దఫాలుగా 6000 రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. ఒక్కో విడతలో అర్హులైన రైతుల ఖాతాల్లోకి 2000 రూపాయల చొప్పున జమ చేస్తున్నారు. కేంద్ర సర్కార్ ఇప్పటి వరకు ఈ పథకం కింద 14 విడతలుగా నిధులను రిలీజ్ చేసింది. మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయా? లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ సైట్‌ లో చూసుకోవొచ్చు.

Exit mobile version