Site icon NTV Telugu

ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో భేటీకానున్న ప్రధాని

PM Modi

PM Modi

ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కరోనాపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. మణిపూర్‌, అసోంతో పాటు మిగతా రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్రం ఇప్పటికే ఈ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. గత వారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా.. కరోనా పరిస్థితులపై రివ్యూ నిర్వహించారు. టెస్ట్, ట్రాక్‌, ట్రీట్‌, వ్యాక్సినేషన్‌తో పాటు కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

Exit mobile version