Site icon NTV Telugu

US-India Relations: పీఎం మోడీ ఆయనను రెండుసార్లు నోబెల్‌కు నామినేట్ చేయాలి.. ట్రంప్‌పై అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ విమర్శలు

Modi

Modi

డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా భారత్ పై అక్కసు వెల్లగక్కుతున్నాడని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఆరోపించారు. ట్రంప్ తప్పుడు విధానాలు భారత్-అమెరికా సంబంధాలపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన అన్నారు. అమెరికా భారతదేశంపై 50 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. చైనా కూడా రష్యన్ చమురును కొనుగోలు చేస్తుందని, కానీ అమెరికా చైనాపై సుంకం విధించలేదని బోల్టన్ అన్నారు. సుంకాల ప్రభావాన్ని రద్దు చేయడానికి సమయం పడుతుందని బోల్టన్ హెచ్చరించారు. “గత 30 రోజుల్లో వైట్ హౌస్ భారత్ కు చేసిన నష్టం, నమ్మకం, విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి చాలా సమయం పడుతుంది” అని ఆయన అన్నారు.

Also Read:ZPTC Vote Counting: నేడు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప్ప ఎన్నికల కౌంటింగ్.. ఫలితాలపై ఉత్కంఠ..!

బోల్టన్ పాకిస్తాన్‌ను ప్రస్తావిస్తూ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు. ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రభుత్వం ట్రంప్‌ను ఎదుర్కోవడానికి మెరుగైన మార్గాన్ని ఎలా కనుగొంటుందో అని ఎద్దేవా చేశారు. “ప్రధాని మోడీకి నా ఏకైక సూచన ఏమిటంటే, ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి రెండుసార్లు నామినేట్ చేయాలని విమర్శించారు. ఈ ఏడాది జూన్‌లో, ఇటీవలి భారతదేశం-పాకిస్తాన్ వివాదంలో ట్రంప్ చేసిన “నిర్ణయాత్మక దౌత్య జోక్యం” కోసం ఆయన పేరును 2026 నోబెల్ శాంతి బహుమతికి అధికారికంగా సిఫార్సు చేస్తామని పాకిస్తాన్ ప్రకటించింది.

Exit mobile version