Site icon NTV Telugu

Vikram 32-bit Processor: సెమికాన్ ఇండియాలో.. తొలి మేడ్ ఇన్ భారత్ చిప్‌ను విడుదల చేసిన ప్రధాని మోడీ..

Vikram 32 Bit Processor

Vikram 32 Bit Processor

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం న్యూఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025 ఈవెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా పీఎం మోడీ భారతదేశపు మొట్టమొదటి చిప్‌సెట్‌ను ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా కూడా పాల్గొన్నారు. మోడీ విక్రమ్ 32-బిట్ ప్రో చిప్‌ను ప్రదర్శించారు. సెమీకండక్టర్ చిప్ ఒక సిలికాన్ సర్క్యూట్ బోర్డ్ లాంటిది. ఈ చిప్ ఏదైనా పరికరం లేదా గాడ్జెట్‌కి.. మానవునికి బ్రెయిన్ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైనది. సెమీకండక్టర్ చిప్ డేటా ప్రాసెసింగ్, స్టోరేజ్, కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్‌లతో సహా అనేక విధులను నిర్వహిస్తుంది.అలాగే, సెమికాన్ ఇండియా 2025 ప్రారంభోత్సవం తర్వాత, ఈ సంవత్సరం నుంచి భారతదేశం తన మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్‌సెట్ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తుందని ప్రధాని చెప్పారు.

Also Read:YS Jagan: రైతులకు కూలి ఖర్చులు కూడా రావడం లేదు.. ప్రభుత్వమే బ్లాక్‌ మార్కెట్‌ను ప్రోత్సహిస్తోంది..!

విక్రమ్ చిప్‌ను ఇస్రో సెమీకండక్టర్ ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా మేక్ ఇన్ ఇండియా 32-బిట్ మైక్రోప్రాసెసర్. సెమీకండక్టర్ చిప్‌సెట్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు చిప్‌సెట్‌లను ఎగుమతి చేయగలగడం సెమికాన్ ఇండియా 2025 లక్ష్యం. సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు, అధునాతన ప్యాకేజింగ్, కృత్రిమ మేధస్సు, పరిశోధన, పెట్టుబడిపై దృష్టి పెట్టడం ఈ సమావేశం లక్ష్యం. సెమికాన్ ఇండియా 2025 ప్రారంభోత్సవం తర్వాత, మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కొన్ని సంవత్సరాలలో ప్రపంచ సెమీకండక్టర్ల మార్కెట్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లను దాటుతుందని తెలిపారు. ఈ 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్లో భారతదేశం ముఖ్యమైన వాటాను కలిగి ఉండబోతోంది.

Exit mobile version