జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. నిఖిల్ ఈ ఇంటర్వ్యూ ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రపంచంలోని యుద్ధ పరిస్థితులు, రాజకీయాల్లోకి యువత ప్రవేశం, మొదటి, రెండవ టర్మ్ పాలన మధ్య వ్యత్యాసంపై ప్రధాని మోడీ స్పందించారు. ఆ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి సారి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూకి హాజరైనట్లు తెలిపారు.
READ MORE: Game Changer : సినిమాలో లేని ‘నానా హైరానా’ సాంగ్.. యాడ్ చేసేది ఎప్పుడంటే..?
ఈ సందర్భంగా నిఖిల్ కూడా నేను హిందీ బాగా మాట్లాడకపోతే నన్ను క్షమించండి అన్నారు. దీనిపై ప్రధాని మోడీ నవ్వుతూ బదులిస్తారు. రాజకీయ నాయకుడు కావాలంటే యువతలో ఎలాంటి ప్రతిభ ఉండాలని నిఖిల్ ప్రధానిని ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ రాజకీయాల్లోకి మంచి వ్యక్తులు రావాలని సూచించారు. ఆశయంతో కాకుండా లక్ష్యంతో రండి అని సూచించారు. ఇక్కడే మోడీ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. “నేను ముఖ్యమంత్రి అయ్యాను. నా వల్ల కూడా కొన్ని తప్పులు జరిగాయి. నేనూ మనిషినే, దేవుడిని కాను కదా.” అని తెలిపారు. నేడు ప్రపంచం మొత్తం యుద్ధం దిశగా పయనిస్తోంది. దీనిపై మనం ఆందోళన చెందాలా? అనే ప్రశ్నకు మోడీ నవ్వుతూ.. సమాధానమిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ.. ఇది ఆయన మొదటి పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ కావడం గమనార్హం.
READ MORE: Game Changer : గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్టనర్ ఎవరంటే..?