Site icon NTV Telugu

PM Modi: అండర్ గ్రౌండ్ మెట్రోను ప్రారంభించిన మోడీ!

Pune Metro

Pune Metro

PM Modi: సెప్టెంబరు 26న జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ పూణె పర్యటన వర్షం కారణంగా రద్దయింది. జిల్లా కోర్ట్ మెట్రో స్టేషన్ నుండి స్వర్గేట్ మెట్రో స్టేషన్ (పుణె మెట్రో) వరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్గాన్ని ఈరోజు ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ స్వయంగా ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే హాజరయ్యారు. ఇక ఈ విషయం పూణే వాసులకు నిజంగానే శుభవార్త.

Road Rage: అమానుషం.. పోలీసు కానిస్టేబుల్‌ను కారుతో గుద్ది చంపిన వైనం.!

చాలా కాలంగా ఎదురుచూస్తున్న జిల్లా కోర్టు నుండి పూణేలోని స్వర్గేట్ మొదటి భూగర్భ మెట్రో లైన్ (పూణే మెట్రో) నేటి నుండి ప్రయాణీకుల కోసం ప్రారంభమైంది. జిల్లా కోర్టు నుండి స్వర్గేట్ మెట్రో మార్గాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ మెట్రోని ఆన్‌లైన్‌లో నరేంద్ర మోదీ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ హాజరుఅయ్యారు. ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత సాధారణ ప్రయాణికులకు మార్గం తెరవబడుతుంది. ఈ మార్గంలో డిస్ట్రిక్ట్ కోర్ట్, కస్బా పేత్, మండై, స్వర్గేట్ అనే 4 మెట్రో స్టేషన్లు ఉన్నాయి.

Call Money: మరోసారి వెలుగులోకి కాల్ మనీ దందాలు..

Exit mobile version