Site icon NTV Telugu

PM Modi: ఇది సామాన్యులకు తీపికబురు.. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త జీఎస్టీ రేట్లు రేపు, సెప్టెంబర్ 22న అమలులోకి వస్తాయి. దానికి ముందు.. మోడీ మాట్లాడుతూ.. నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 22వ తేదీ నవరాత్రి మొదటి రోజు అని, ఆ రోజున నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ అమలు చేయబడుతుందని పేర్కొన్నారు. ఇది కేవలం వేడుకలకు సమయం మాత్రమే కాదని, ఆర్థికాభివృద్ధికి, పన్ను సంస్కరణలకు కీలకమైన దశ అని ప్రధాని అన్నారు. రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలవుతున్నాయని.. ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్యతరగతి ఎంతో ఆదాయం మిగులుతోందని తెలిపారు. పండగల సమయంలో దేశంలోని అందరికీ మేలు జరుగుతుందని.. జీఎస్టీ సంస్కరణలతో భారత వృద్ధి రేటు మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో దేశంలోని ప్రతి పౌరుడి డబ్బు ఆదా అవుతుందన్నారు. ఇది సామాన్యులకు తీపికబురు అన్నారు.

READ MORE: 10,100mAh బ్యాటరీ, 12 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరాలతో Huawei MatePad 12 X లాంచ్!

“2017లో జీఎస్టీతో కొత్త అధ్యాయం మొదలైంది. అంతకు ముందు ఎన్నో రకాల పన్నులు ఉండేవి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలన్న పన్నులు కట్టాల్సి ఉండేది. జీఎస్టీ సంస్కరణలు ఎఫ్‌డీఐలను మరింత ప్రోత్సహిస్తాయి. గతంలో బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చి వస్తువులు అమ్ముకోవాలంటే ఎంతో కష్టంగా ఉండేది. గతంలో టాక్స్‌, టోల్‌తో కంపెనీలన్ని ఇబ్బందులు పడ్డాయి. ఆ భారమంతా వినియోగదారులపై పడేది. మీరు ఇళ్లు కట్టుకోవాలన్న, బండి, ఎలక్ట్రిక్ వస్తువులు కొనాలన్నా..మీకు భారీగా ఆదా అవుతుంది.” అని ప్రధాని మోడీ అన్నారు.

Exit mobile version