Site icon NTV Telugu

Modi Slams Pakistan: ప్రధాని మోడీ మాటలతో తలపట్టుకున్న పాక్ ప్రధాని

Pm Modi

Pm Modi

Modi Slams Pakistan: షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసందర్భంగా ప్రధాని తన ప్రసంగంలో ఉగ్రవాదంపై గురించి మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావించారు. SCO సాక్షిగా మోడీ పాక్‌కు బలమైన సందేశం ఇచ్చారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కూడా అక్కడే ఉన్నారు.

READ ALSO: Peddi: త్వరలో ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్.. రెహ్మాన్తో చరణ్ స్పెషల్ పిక్

ప్రధాని ఏం చెప్పారంటే..
ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ‘ఇటీవల భారత్ పహల్గాం ఉగ్రదాడిని చూసింది. ఈ దుఃఖ సమయంలో మాతో పాటు నిలిచిన దేశాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దాడి భారతదేశ మనస్సాక్షికి దెబ్బ మాత్రమే కాదు, ప్రతి దేశానికి, మానవత్వాన్ని విశ్వసించే ప్రతి వ్యక్తికి బహిరంగ సవాలు. అటువంటి పరిస్థితిలో, కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇవ్వడం ఆమోదయోగ్యంగా ఉంటుందా’ అని అన్నారు. మోదీ తన ప్రసంగంలో.. SCOకి సంబంధించి భారతదేశ విధానాన్ని వివరించారు. S అంటే భద్రత, C అంటే కనెక్టివిటీ, O అంటే అవకాశం అని పేర్కొన్నారు. భద్రత, శాంతి, స్థిరత్వం అభివృద్ధికి పునాది అని, కానీ ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం ఈ మార్గంలో అతి పెద్ద సవాళ్లు అని అన్నారు.

ఉగ్రవాదంపై ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని, అన్ని దేశాలు ఐక్యంగా ఉండి, దానిని ఏ రూపంలోనైనా వ్యతిరేకించాల్సి ఉంటుందని ప్రధాని స్పష్టమైన సందేశం ఇచ్చారు. ప్రధాని మోదీ ఉగ్రవాదంపై ప్రసంగిస్తున్నప్పుడు, పాక్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ఆయన ఎదురుగా కూర్చున్నారు. పహల్గాం దాడి గురించి మోడీ ప్రస్తావించగానే, షాబాజ్ షరీఫ్ తల పట్టుకున్న దృశ్యాలు బయటికి వచ్చాయి.

READ ALSO: BSNL: గుడ్ న్యూస్.. బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ గడువు పొడిగింపు..

Exit mobile version