Site icon NTV Telugu

PM Kisan Yojana: రైతన్నలకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 21వ విడత నిధుల విడుదలకు డేట్ ఫిక్స్.. ఆరోజే ఖాతాల్లోకి

Pm Kisan

Pm Kisan

రైతులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏడాదికి మూడు విడతల్లో రూ. 6 వేల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ఇప్పటి వరకు 20 విడతలు పూర్తవగా 21 వ విడత నిధుల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగ కేంద్రం రైతులకు శుభవార్తను అందించింది. పీఎం కిసాన్ 21వ విడత నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ చేసింది. నవంబర్ 19న రైతుల ఖాతాలకు ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది.

Also Read: Bihar Election Results: బిహార్‌లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ !

ఈ సమాచారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఎక్స్ అఫీషియల్ అకౌంట్ లో అందించారు. ఈరోజు, నవంబర్ 14వ తేదీ, ప్రభుత్వం Xలో దీనిని ప్రకటించింది. 2019లో ప్రారంభించబడిన ఈ పథకం అర్హత కలిగిన రైతులకు వార్షికంగా రూ.6,000 సహాయం అందిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది.

Exit mobile version