NTV Telugu Site icon

Indore IT Firm : ‘దయచేసి ఇంటికి వెళ్లండి’ అంటున్న సరికొత్త సాఫ్ట్ వేర్

Job

Job

Indore IT Firm : ఇండోర్‌లోని ఒక చిన్న ఐటీ కంపెనీ సరికొత్త సాఫ్ట్ వేర్ ను సృష్టించింది. తన ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొత్త మార్గాన్ని తీసుకురానుంది. పని-జీవిత సమతుల్యతను కాపాడడానికి అసాధారణమైన మార్గాన్ని ఉద్యోగులకు అందించనుంది. వారి షిఫ్ట్ ముగియగానే.. ఇంటికి వెళ్లే టైం వచ్చినప్పుడు వారికి గుర్తు చేసేందుకు ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను సృష్టించింది. ఇది సాఫ్ట్‌గ్రిడ్ కంప్యూటర్ల సాఫ్ట్‌వేర్ నోటిఫికేషన్ సిస్టమ్‌తో అమర్చబడి ఉంది. ఇది ఉద్యోగి షిఫ్ట్ ముగిసిన క్షణంలో ప్రారంభమవుతుంది. ‘ఆఫీస్ సిస్టమ్ 10 నిమిషాల్లో మూసివేయబడుతుంది’ అని వారిని హెచ్చరిస్తుంది. షిప్ట్ టైం అయిపోగానే ‘దయచేసి ఇంటికి వెళ్లండి’ అంటూ వారిని అలర్ట్ చేస్తుంది.

Read Also: Pakistan Girl : లూడో గేమ్‎తో ఒక్కటయ్యారు.. అధికారులేమో వద్దుపొమ్మన్నారు

సుదీర్ఘంగా గంటల కొద్ది పని చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని వల్ల ఉద్యోగులకు హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని 2021లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వారానికి 55 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పని చేయడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 35శాతం ఎక్కువని వెల్లడించింది. ఆ సమయంలో గుండె జబ్బుతో మరణించే ప్రమాదం కూడా 17శాతం ఎక్కువ అని హెచ్చరించింది. ఈ సాఫ్ట్ వేర్ తీసుకురావడం వెనుక ఉన్న ఆలోచన ఉద్యోగులకు మంచి పని-జీవిత సమతుల్యతను అందించడం.. తద్వారా వారు తమ కుటుంబాలతో ఎక్కువ సమయం గడపవచ్చని ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ గోలానీ తెలిపారు. తన్వి ఖండేల్వాల్ అనే ఉద్యోగి కంపెనీ డెస్క్‌టాప్‌లో హెచ్చరిక చిత్రం వచ్చినప్పుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌కి దాదాపు 400,000 లైక్‌లు వచ్చాయి.