NTV Telugu Site icon

Plane Crash : ఓరీ దేవుడా… రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వైరల్ అవుతున్న వీడియో

Flight

Flight

సాధారణంగా విమానం కూలిపోవడం అనేది చాలా భయంకరమైన విషయం. ఒక్కసారి ప్లేన్ క్రాష్ అయితే అందులో ఒక్కరు కూడా బ్రతికే అవకాశం ఉండదు. ఈ మధ్య కారణమేదైనా విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నారు. సాంకేతిక లోపాలు, వాతావరణం అనుకూలించక కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు పైలెట్ తన నైపుణ్యంతో విమానంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతూ ఉంటారు. మరికొన్ని సార్లు దురదృష్టవశాత్తు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా మలేషియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూస్తేంటేనే ఈ వీడియో భయంకరంగా అనిపిస్తోంది. రోడ్డుపై పెద్ద శబ్దంతో విమానం కుప్పకూలింది. దాని నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి రోడ్డు మొత్తం వ్యాపించాయి.

Also Read:Charging Phone At Work: ఆఫీస్ లో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్న ఉద్యోగి.. బాస్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

మలేషియాలో తాజాగా విమానం కూలిన ఘటనలో 10 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. లంగ్ కావి ఎయిర్ పోర్ట్ నుంచి సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా ఎయిర్ పోర్టుకి వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ కారణంగానే ప్రమాదం జరినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో ఆ విమానంలో ఆరుగురు ప్రయాణీకులతో పాటు ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో విమానం రోడ్డుపై కూలడంతో అటుగా వెళుతున్న ఒక బైకర్, కారులో ఉన్న మరో వ్యక్తి మరణించారు. మొత్తంగా ఈ ప్రమాదం కారణంగా 10 మంది మరణించారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు హైవైపే వెళ్తున్న కారు డాష్ కామ్ లో రికార్డ్ అయ్యాయి. ఒక నాలుగు లైన్ లు ఉన్న చిన్నపాటి రోడ్డుపై విమానం కూలిపోయింది. ప్లేన్ క్రాష్ అయిన వెంటనే దానిని నుంచి పెద్ద శబ్దం వచ్చి చుట్టుపక్కల మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విమానం నార్తర్న్ రిసార్ట్ ఐల్యాండ్ లంగ్ కావి నుంచి సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా ఎయిర్ పోర్టుకి వెళ్తోంది. మార్గమధ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది. విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో స్టేట్ అసెంబ్లీ మ్యాన్ జొహారీ ఉన్నట్లు గుర్తించారు. విమాన ప్రమాదంపై అధికారులు దర్యాఫ్తు చేస్తున్నారు. విమానం ఎందుకు కూలింది? అసలు సమస్య ఏంటి అనే పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Show comments