Site icon NTV Telugu

Stock Market: తక్కువ టైంలో స్టాక్ మార్కెట్స్ లో భారీ ఆదాయం సంపాదించే ప్లాన్..

Stock

Stock

స్టాక్ మార్కెట్లో ఎక్కువ లాభాలు అందించే షేర్లను వెతికి పట్టాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అందుకోసం తమదైన పద్దతిలో రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ప్రముఖ బ్రోకరేజి కంపెనీ మోతిలాల్ ఓస్వాల్ ప్రముఖమైన ఐదు షేర్ల పేర్లను రికమండ్ చేసింది. ఈ షేర్లు అతి తక్కువ కాలంలోనే మంచి లాభాలను పొందే అవకాశం ఉందని అంచనా వేసింది. టెక్నికల్ ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకొని బ్రోకరేజి సంస్థ ఈ షేర్స్ ను రికమండేషన్స్ చేసింది.

Also Read : Credit Card: క్రెడిట్ కార్డ్ ను యూపీఐ పేమెంట్‌కు ఉపయోగించాలని చూస్తున్నారా..!

స్టాక్ మార్కెట్ దాని 20 వారాల మూవింగ్ యావరేజ్‌లో ఉంచబడింది. రోజువారీ స్కేల్‌లో 100 EMA నుంచి మద్దతును తీసుకుంటుంది. ఇక్కడ నుంచి.. స్టాక్ పెరగడానికి మొమెంటం కనబడుతుంది. ఈ సంవత్సరం స్టాక్ దాదాపు 11 శాతం పడిపోయింది.. ఇక్కడ నుంచి నివియాకు మంచి అవకాశం ఉంది. M&M ఫైనాన్స్ షేర్ రోజువారీ స్కేల్‌లో పోల్.. ఫ్లాగ్ ప్యాటర్న్‌ను ఏర్పరుచుకుంది. ఈ ఏడాది దీని విలువ స్టాక్ మార్కెట్ లో దాదాపు 22 శాతం లాభపడింది. ఈ లాభాలు మరింత కొనసాగుతాయని భావిస్తున్నారు.

Also Read : Pawan kalyan : శంకర్ తో సినిమా చేయడానికి సిద్ధం అయిన పవన్..?

TATA కన్స్యూమర్ ప్రోడక్ట్స్ షేర్ మళ్లీ వీక్లీ స్కేల్‌లో బ్రేక్‌అవుట్ జోన్‌ను మళ్లీ పరీక్షించింది. ఇక్కడి నుంచి ఉన్నత స్థాయిల వైపు తాజా కదలికను చూపుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ స్టాక్ 3 శాతం రాబడిని ఇచ్చింది. కోరమాండల్ ఇంటర్నేషనల్ షేర్స్ ప్రస్తుతం దాని 20-నెలల సగటుతో స్టాక్ మార్కెట్ లో దూసుకుపోతుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు దీని స్టాక్ 6 శాతం మేర పెరిగింది. బాటా ఇండియా షేర్ లోయర్ జోన్‌లో తన స్థానాన్ని ఏర్పరుచుకుంది. గత 3 నెలల నుంచి అధిక లాభాలను సాధిస్తోంది. దీంతో షేర్ మార్కెట్ లో సానుకూల ధోరణిని చూపుతుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు దీని షేర్లు 5 శాతం క్షీణించింది.

Exit mobile version