NTV Telugu Site icon

No Vacancy: దేవుడా.. ఐఐటీ స్టుడెంట్స్ కు కూడా ప్లేస్ మెంట్స్ కరువాయే.. వేలాది స్టూడెంట్స్ ఎదురుచూపులు..

Mo Job

Mo Job

ప్రస్తుతం ప్రపంచ ఆర్ధిక మాంద్యం దృష్ట్యా పెద్ద టెక్ కంపెనీలు, అలాగే అనేక బహుళజాతి కంపెనీలు వారి ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్న సంగతి ప్రతిరోజు చూస్తున్నాము. ఇకపోతే ప్రపంచ ఖ్యాతి పొందిన ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కూడా ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్న విద్యార్థులకు కూడా ప్లేస్ మెంట్స్ దొరకని పరిస్థితి. కొన్ని రోజుల్లో 2024 బ్యాచ్ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తికానుంది. ఈ సమయంలో నిజానికి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో అనేక కంపెనీల ప్లేస్మెంట్స్ హడావుడి ఎక్కువగా ఉంటుంది.

Malavika Mohanan: అందాల హద్దులు చెరిపేస్తున్న మాళవిక మోహనన్

కాకపోతే , ఇప్పుడు ప్రస్తుతం వేరేలా ఉంది. ఈ ఏడాది కేవలం చిన్న, చితకా కాలేజీల్లోనే కాదు., ప్రతిష్టాత్మక ఐఐటీల్లో కూడా ప్లేస్మెంట్ లేకపోవడంతో ఆందోళనలు వెంటాడుతున్నాయి. దేశంలోని వివిధ ఐఐటీల్లో రెండో నియామక రౌండ్లో కూడా వేలసంఖ్యలో విద్యార్థులకు ఇంకా ఉద్యోగాలు లభించలేదు.

Police Jeep: హాస్పిటల్ నాలుగో అంతస్తు లోకి పోలీస్ వెహికల్.. వీడియో వైరల్..

ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు.. విద్యాసంస్థల్లో ప్లేస్మెంట్స్ సంక్షోభం రావడంతో ఆయా ఐఐటీలు కొత్త విభాగాలకు చెందిన స్టార్టప్స్, పూర్వ విద్యార్థులు, రిక్రూటర్లను, ఇదివరకు వారి క్యాంపస్ ల నుంచి నియమించుకున్న కంపెనీలను ప్లేస్మెంట్ టీమ్ సభ్యులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందుకు గాను ప్రొఫెసర్లు, డిపార్ట్మెంట్లు కూడా విద్యార్థులను రంగంలోకి దింపి సహాయం చేయాలని వారు కోరుతున్నారు.