NTV Telugu Site icon

Pista Benefits: రోజుకు పది పిస్తా పప్పులను తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Pist

Pist

డ్రై ఫ్రూట్స్ లలో ఎక్కువగా పిస్తా పప్పులు కూడా ఉంటాయి.. అయితే వీటి గురించి పూర్తి విషయాలు అందరికీ తెలియవు. కానీ రోజు వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

పిస్తా పప్పులు రుచిగా ఉంటాయని తెలిసిందే.. పసుపుపచ్చ వర్ణంలో ఉండే పిస్తా పప్పు ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు.. ఈ పప్పులు రుచిగా ఉండటం మాత్రమే కాదు. వీటి ధర కూడా కాస్త ఎక్కువగానే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు..

వీటిలో ఎక్కువగా ఐరన్‌, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, విటమిన్స్ , ప్రోటీన్, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి సమృద్దిగా ఉంటాయి.. గుండె సమస్యలు తగ్గుతాయి. అలాగే బ్రెయిన్ షార్ఫ్ గా పనిచేస్తుంది. అయితే ఈ పిస్తాలను లిమిట్ గానే తీసుకోవాలి.. ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.. వీటిని ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. అలర్జీ ఉన్నవారు పిస్తా పప్పుకి దూరంగా ఉంటేనే మంచిది.

అంతేకాక కడుపు నొప్పి, మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైన లిమిట్ గా తీసుకోవడం మంచిది.. రోజుకు నాలుగు, ఐదు పప్పులను తినడం మంచిది.. అంతకు మించి తింటే కోరి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే.. ఇది గుర్తుంచుకొని తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.