Site icon NTV Telugu

Pinnelli Ramakrishna Reddy: నేటితో ముగియనున్న పిన్నెల్లి మధ్యంతర బెయిల్‌ గడువు..

Pinnelli

Pinnelli

Pinnelli Ramakrishna Reddy: నేటితో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు మధ్యంతర బెయిల్ గడువు ముగియనుంది.. ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసుల్లో పిన్నెల్లిని అరెస్ట్‌ చేయవద్దు అంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.. అయితే, కౌంటింగ్ నేపథ్యంలో ఇవాళ్టి వరకు అరెస్ట్ చేయవద్దని గతంలో ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు.. ఈ రోజు విచారణ చేయనున్న వెకేషన్ బెంచ్.. అయితే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ఈవీఎం ధ్వంసంతోపాటు, మరికొన్ని కేసుల్లో పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుంది.. నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో పిన్నెల్లి ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. అతడి కదలికలపై నిఘా పెట్టారు.. కోర్టు ఇచ్చిన గడువు ముగిసిన వెంటనే పిన్నెల్లిని అదుపులోకి తీసుకొని, అరెస్టు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also: Left parties: కనుమరుగైపోతున్న కమ్యూనిస్టు పార్టీలు..

మరోవైపు పోలీసులు తీసుకుంటున్న చర్యలు కూడా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు ఖాయం అనే సంకేతాలు ఇస్తున్నాయి.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకోకుండా అతని చుట్టూ గట్టి పోలీసు నిఘా ఏర్పాటు చేశారు.. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని ఎప్పుడు అరెస్టు చేస్తారో అనే సందిగ్ధత నెలకొంది పలనాడు జిల్లాలో.. కాగా, కౌంటింగ్‌కు ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు విధించింది సుప్రీంకోర్టు.. పిన్నెల్లి కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంపై ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు నంబూరు శేషగిరిరావు.. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్ కు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేసింది.. ఇదే సమయంలో.. ఈ నెల 6వ తేదీన హైకోర్టు పిన్నెల్లి కేసును విచారించి.. పరిష్కరించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

Exit mobile version