Site icon NTV Telugu

Pinnelli Brothers: జంట హత్యల కేసు.. మరోసారి విచారణకు పిన్నెల్లి సోదరులు!

Pinnelli Brothers

Pinnelli Brothers

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల‌ కేసులో మరోసారి విచారణకు హాజరుకావాలంటూ పిన్నెల్లి సోదరులకు మాచర్ల రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. మూడు నెలల క్రితం గుండ్లపాడులో టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: 2027 World Cup: రోహిత్, కోహ్లీలు వన్డే ప్రపంచకప్‌లో ఆడరు!

ఈ కేసులో పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణకు సహకరించాలని సూచించింది. ఈ కేసులో పిన్నెల్లి సోదరులు ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరయ్యారు. మరోసారి విచారణకు రావాలని పోలీసులు తాజాగా నోటీసులలో పేర్కొన్నారు. జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు కూడా రేపటితో ముగియనుంది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Exit mobile version