Pindam Movie : ‘A’ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్.. గర్భిణీ స్త్రీలు ఈ సినిమా చూడొద్దని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ నటుడు శ్రీరామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది సినిమా ఉప శీర్షిక..ఈ సినిమాలో కుశీ రవి హీరోయిన్‌గా నటిస్తుంది.సాయికిరణ్ దైదా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.పిండం మూవీ సాయికిరణ్‌కు మొదటి చిత్రం. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ మరియు ట్రైలర్‌లు విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.సెన్సార్ బోర్డు ఈ మూవీకి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. ఈ సినిమాను గర్భిణీ స్త్రీలు చూడవద్దని సెన్సార్ బోర్డు హెచ్చరిక జారీచేసినట్లు తెలిపింది.
ఈ సినిమా ను డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తం గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కళాహి మీడియా పతాకం పై యశ్వంత్ దగ్గుమాటి ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో శ్రీరామ్‌తో పాటు, ఈశ్వరీరావు, రవివర్మ, మాణిక్ రెడ్డి, బేబీ చైత్ర, బేబీ ఈషా, విజయలక్ష్మి మరియు శ్రీలత తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.ఓ మారుమూల పల్లెటురి లో చాలా రోజులుగా ఎవరూ నివసించని ఒక ఇంట్లో కి హీరో శ్రీరామ్ తన కుటుంబంతో వస్తాడు. అయితే ఆ ఇంట్లో అడుగుపెట్టిన తరువాత వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇంట్లో ఉన్న ఆత్మ.. శ్రీరామ్ కుటుంబానికి నిద్ర లేకుండా చేస్తుంది. వారిని ప్రాణ భయంతో వణికి పోయేలా చేస్తుంది. అలాంటి సమయం లో వారికి సాయం చేయడానికి మంత్రగత్తె ఈశ్వరీ రావు వస్తుంది. ఆమె రాకతోఆ ఇంట్లో ఏం జరుగుతుంది.. అస్సలు ఆ ఆత్మల కథ ఏంటి..వాటి నుంచి శ్రీరామ్ కుటుంబాన్ని ఈశ్వరీ రావు రక్షించిందా లేదా తెలియాలంటే పిండం సినిమా చూడాల్సిందే..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
The scariest film gets more scarier!!#PINDAM certified with a clean "A" Certificate. In theatres worldwide from December 15th 🔥
Statutory Warning: Pregnant women are adviced not to watch this film.@saikirandaida @Yeshwan71014110 @EswariRao @kalaahimedia… pic.twitter.com/7HwLw3EQHE
— Vamsi Kaka (@vamsikaka) December 11, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!