NTV Telugu Site icon

Pilot: అంత కోపం ఏందయ్యా నీకు…బారియర్ గేట్ తెరుచుకోలేదని గొడ్డలితో విరగొట్టిన పైలెట్

Pilot

Pilot

Pilot destroys parking barrier: చాలా మందికి చిన్న చిన్న విషయాలకే చాలా కోపం వస్తూ ఉంటుంది. కోపంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోపంతో ఓ వ్యక్తి ఎయిర్ పోర్ట్ లో ఉన్న పార్కింగ్ బ్యారి గేట్ ను గొడ్డలితో ఇరగొట్టాడు. ఈ మధ్య కాలంలో చాలామంది ఎయిర్ పోర్ట్ లలో, విమానంలో వింత వింతగా ప్రవర్తిస్తూ సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ వ్యక్తి గాలి రావడం లేదంటూ విమానం గాలిలో ఉన్నప్పుడు ఎగ్జిట్ గేట్ తెరవడానికి ప్రయత్నించాడు. ఇక విమానంలో సిబ్బందితో గొడవ పడిన వీడియోలు, టాయిలెట్ పోసిన వీడియోలు, అమ్మాయిలను ఇబ్బంది పెట్టిన ఘటనలకు సంబంధించిన చాలా విషయాలు వైరల్ అయ్యాయి. తాజాగా ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకున్న మరో  ఘటన కూడా వైరల్ అవుతుంది. అయితే ఈసారి గొడవ చేసింది ప్రయాణికులు కాదు ఎంతో క్రమశిక్షణతో ఉండాల్సిన పైలెట్.

Also Read: New Pics Of Moon By Chandrayaan 3: జాబిల్లి ఫోటోలు తీసిన చంద్రయాన్ 3… షేర్ చేసిన ఇస్రో

వివరాల ప్రకారం.. ఎయిర్ పోర్ట్ ఎంప్లాయ్‌ పార్కింగ్‌ స్థలంలో మూడు ఎగ్జిట్‌ పాయింట్ ల వద్ద కొన్ని కార్లు వేచి ఉన్నాయి. అయితే ఆ సమయంలో బారిగేట్లు తెరుచుకోలేదు. అక్కడ లైన్ లో ఆరు కారులు వేచి ఉండగా దానిలో ఉన్న ఒక కారులో నుంచి ఓ వ్యక్తి గొడ్డలి పట్టుకొని వచ్చాడు. ఆ బారిగేట్లను హీరోలాగా గొడ్డలితో ఇరకొట్టాడు. ఈ ఘటన అమెరికాలోని డెన్వర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.బ్యారీ గేట్లు తెరుచుకోకపోవడంతో కోపంలో ఉన్న కెన్నెత్‌ హెండర్సన్‌ జోన్స్‌ అనే 63 ఏళ్ల పైలట్‌ తన వద్ద ఉన్న గొడ్డలితో గేటును విరగ్గొట్టాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ఎయిర్ పోర్ట్ సిబ్బంది అతను వెళ్లిపోకుండా అడ్డుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య చిన్నపాటి ఘర్షణ కూడా జరిగింది. ఇక మరో వ్యక్తి దీని గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డుకావడంతో వైరల్ గా మారింది.