తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ‘మార్వాడి గో బ్యాక్’ జేఏసీ రాష్ట్ర కమిటీ ఏర్పడింది. మార్వాడి గో బ్యాక్ జేఏసీ చైర్మన్‌గా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఎన్నికయ్యారు. పిడమర్తి రవిని 11 సంఘాల నాయకులు కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ… మార్వాడీలకు హెచ్చరికలు జారీ చేశారు. కొత్తగా షాపులు ఏర్పాటు చేస్తే భౌతిక దాడులే అని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: Rayadurgam Land: దీనమ్మ జీవితం.. ఎకరం రూ.177 కోట్లు ఏంది సామీ!
‘తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు షాపులు పెట్టవద్దు. మార్వాడీలు కొత్తగా షాపులు ఏర్పాటు చేస్తే భౌతిక దాడులతో పాటు షాపులు ధ్వంసం చేస్తాం. మార్వాడిలు తెలంగాణ రాష్ట్రాన్ని కల్తీమయం చేశారు. దానిని మేము సమర్థవంతంగా ఎదుర్కొంటాం. దీపావళి తర్వాత రాష్ట్ర పర్యటన ఉంటుంది’ అని పిడమర్తి రవి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులను, కన్వీనర్లతో నూతన కమిటీని చైర్మన్ ఎన్నుకున్నారు. ‘మన రాష్ట్రం-మన దుకాణం’ అని పోస్టర్‌లో పేర్కొన్నారు. ‘మార్వాడి గో బ్యాక్ జేఏసీ’.. ఇది తెలంగాణ ఉద్యమకారుల పోరాటం అని రాసుకొచ్చారు.
