Site icon NTV Telugu

Phubbing: ఫోన్తోనే ఎక్కువ టైం గడిపేస్తున్నారా.. మీ భాగస్వామితో ఇబ్బందులు తప్పవు..!

Phubbing

Phubbing

ఫోన్తోనే ఎక్కువ టైం గడిపేస్తున్నారా.. పక్కన ఉండే మీ భాగస్వామిని పట్టించుకోవడం లేదా..!. ఈ అలవాటును మానుకోండి.. లేదంటే మీ రిలేషన్ షిప్ లో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ వ్యసనం వల్ల రిలేషన్ షిప్ చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవిధంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్లతో లాభాలు ఉన్నాయి.. నష్టాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన దగ్గర నుండి అన్ని విషయాలను అందులోనే తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుత కాలంలో ఫోన్‌లోనే గంటల తరబడి గడపడం సర్వసాధారణమైపోయింది. దీంతో జీవితాల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

టర్కీలోని ఓ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం.. ఫబ్బింగ్ అనేది ఒక సాధారణ సమస్యగా మారిందని తెలిపింది. దీనివల్ల దంపతుల మధ్య గొడవలు పెరుగుతున్నాయి. అంతే కాకుండా వారి మధ్య సాన్నిహిత్యం కూడా తగ్గుతుందని పేర్కొంది.

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు.. కమిషన్‌ తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

అసలు ఫబ్బింగ్ అంటే ఏమిటి?
ఎక్కువగా ఫోన్‌పైనే దృష్టి పెట్టడాన్ని ఫబ్బింగ్ అంటారు. “ఫోన్” మరియు “స్నబ్బింగ్” అనే పదాలను కలపడం ద్వారా “ఫబ్బింగ్” అనే పదం వచ్చింది. స్నబ్బింగ్ అంటే అగౌరవపరచడం లేదా విస్మరించడం. మీరు మీ జీవిత భాగస్వామిని విస్మరించి, ఫోన్‌పై శ్రద్ధ చూపి పబ్బం గడుపడిన్ని ఫబ్బింగ్ అంటారు.

Star Vanitha: ‘స్టానర్‌ వనిత’ వచ్చేస్తోంది.. ఇక, టీవీ రిమోట్‌ అందుకోండి..

పబ్బింగ్ నివారించడానికి చిట్కాలు
మీకు మీ భాగస్వామికి మధ్య ఎటువంటి వైరుధ్యం ఉండకూడదని అనుకుంటే.. పబ్బింగ్ నుండి దూరంగా ఉండండి. ఈ అలవాటు వల్ల బంధం చెడిపోతుంది. మీ భాగస్వామిని పట్టించుకోకుండా.. ఫోన్‌పై శ్రద్ధ పెట్టే అలవాటును మానుకోండి. దాని ద్వారా జీవితంలో సుఖ:సంతోషాలతో గడపవచ్చు. అంతేకాకుండా.. ఫోన్ లో వచ్చే నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి. సోషల్ మీడియా యాప్‌లను తీసివేయండి. ఫోన్‌ని ఉపయోగించే అలవాటును ట్రాక్ చేయడానికి చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఫోన్‌కు ఎంత సమయం ఇవ్వాలో ఆ సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. ఫోన్ మీదకే పదే పదే అనవసరంగా దృష్టి మరల్చినట్లయితే.. దానిని ఒక దగ్గర పెట్టి డోంట్ డిస్టర్బ్ లేదా “సైలెంట్” మోడ్‌లో ఉంచండి.

Exit mobile version