Phone Tapping Case: తెలంగాణలో భారీ సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. గతంలో అధికారంలో ఉన్న కొంతమంది ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన కొందరు అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పలు కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వాధికారులు వంటి అనేక మంది టార్గెట్ అయినట్లు బయటపడడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.
Read Also:Raw Garlic : ఈ సమస్యలతో బాధపడేవారు.. ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే డాక్టర్‌తో పని లేదు !
ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా రాజకీయ నాయకులు ఈ కేసులో మరో కీలక మలుపు తిరిగేలా చేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, డీసీసీ లీగల్ సెల్ చైర్మన్ దేవరాజు గౌడ్‌కు SIT బృందం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వారిద్దరిని నేడు (బుధవారం) వాంగ్మూలం నమోదు కోసం సిట్ కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించింది. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్టు అధికారికంగా గుర్తించిన సిట్.. ఆయనతో పాటు ఆయన డ్రైవర్ అశోక్, పర్సనల్ అసిస్టెంట్ కరుణాకర్ రెడ్డి, మాజీ బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు అరవింద్ ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయని గుర్తించింది.
Read Also:Crime News: దారుణం.. రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేసిన కసాయి కొడుకు..!
ఇప్పటికే ఈ కేసులో పలువురు రాజకీయ నాయకులు, అధికారులు తమ వాంగ్మూలాలు నమోదు చేయగా.. వాటిని ఆధారంగా చేసుకుని సిట్ మరింత లోతుగా విచారణ చేపట్టింది. బాధితుల స్టేట్‌మెంట్ల ఆధారంగా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులపై టెక్నికల్ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుండటంతో, ట్యాపింగ్ వ్యవహారంపై మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడే అవకాశం ఉంది.
