Site icon NTV Telugu

Phone Tapping: 4013 ఫోన్ నెంబర్లను ట్యాపింగ్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే నిజాలు..!

Phone Tapping (1)

Phone Tapping (1)

Phone Tapping: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్తున్నాయి. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా 4013 పోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసింది ప్రణీత్ రావు అండ్ టీమ్. వీరిలో 618 మంది పొలిటికల్ లీడర్ల పోన్ ట్యాపింగ్ జరిగిందని సమాచారం. ఈ 618 మందిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ , పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్ట్ లకు సంబంధించినట్లుగా తెలుస్తోంది.

Read Also:Drugs Federals: డ్రగ్ పెడ్లర్‌ గేమ్ ఓవర్.. డ్రగ్స్ దందా ముఠా అరెస్ట్..!

ఇందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యుల తొ పాటు అనుచరుల ఫోన్లు ట్యాప్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైనం పల్లి హనుమంత్ రావు, మాజీ ఎమ్మెల్యే KS రత్నం, మర్రి శశిధర్ రెడ్డి, బిఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, పద్మా దేవేందర్ రెడ్డి , మర్రి జనార్ధన్ రెడ్డి, తాటి కొండ రాజయ్యలకు సిట్ నోటీస్ ఇవ్వనుంది. అలాగే ఐఏఎస్ లు రోనాల్డ్ రాస్, గౌతంల ఫోన్లు సైతం ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో భాగంగా ఇప్పటివరకు 228 మంది స్టేట్మెంట్ రికార్డింగ్ లు పూర్తి చేసారు అధికారులు.

Read Also:Gadwal Surveyor Murder: సర్వెయర్ తేజేశ్వర్ హత్య.. ట్విస్టుల మీద ట్విస్టులు..!

Exit mobile version