NTV Telugu Site icon

Phone Charging: రోజుకు ఎన్నిసార్లు ఫోన్ కు చార్జింగ్ పెట్టాలో తెలుసా?

Phone Charging

Phone Charging

ఫోన్ వాడకాన్ని బట్టి ఫోన్ లో చార్జింగ్ త్వరగా అయిపోతుంది.. ఇంటర్నెట్ ను వాడటం వల్ల కానీ.. కొన్ని యాప్స్ ను వాడటం వల్ల కానీ చార్జింగ్ త్వరగా అయిపోతుంది.. దాంతో పదే పదే ఫోన్ కు చార్జింగ్ ను పెడతారు.. అలా చెయ్యడం వల్ల ఫోన్ పాడై పోతుందని నిపుణులు చెబుతున్నారు..ఫోన్ పాతగా అవుతున్నా కొద్దీ బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది.. మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఫోన్ బ్యాటరీని కాపాడుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడల్లా ఛార్జింగ్ పెట్టడం మన చుట్టూ చూస్తుంటాం. ఇంకా చాలా మంది ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచిన కొద్దిసేపటికే మళ్లీ బయటకు తీస్తూ ఉంటారు.. మీరు ఫోన్‌ను తరచుగా ఛార్జింగ్ చేస్తూ ఉండడం ద్వారా.. ఫోన్ యొక్క బ్యాటరీ కాలక్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే రోజుకు ఎన్నిసార్లు ఫోన్ కు చార్జ్ చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. బ్యాటరీ 20% లేదా అంతకంటే ఎక్కువ పడిపోవడాన్ని అనుమతించవద్దు. మరియు బ్యాటరీని పూర్తిగా డిశ్చార్జ్ అవడాన్ని నివారించండి. బ్యాటరీ స్థాయి 80% నుంచి 100% మధ్య ఉన్నప్పుడు అన్‌ప్లగ్ చేయండి. మీ ఫోన్‌ను ఎక్కువసేపు 100% బ్యాటరీ స్థాయిలో ఉంచకండి.. వేడెక్కుతుంది..

ఫోన్ చార్జింగ్ 20–80 నియమాన్ని పాటించాలని సిఫార్సు చేస్తారు. 20 అంటే బ్యాటరీ 20% వరకు ఖాళీ అయినప్పుడు, దానిని ఛార్జింగ్‌లో ఉంచాలి. మరియు 80 అంటే 80% ఉన్నప్పుడు ఛార్జింగ్‌ను తీసివేయడం సరైనది. అంటే, మీ ఫోన్ రోజుకు రెండుసార్లు 20%కి చేరుకుంటే, మీరు దానిని రెండుసార్లు మాత్రమే ఛార్జింగ్‌లో ఉంచాలి.. అంతకంటే ఎక్కువ సార్లు ఉంచితే బ్యాటరీ డేడ్ అయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు… మీ ఫోన్ బ్యాటరీ 20% ఉన్నప్పుడు మాత్రమే ఫోన్‌లో ‘తక్కువ బ్యాటరీ’ అనే హెచ్చరిక వస్తుందని మీరు గమనించండి. అంటే అంతకు ముందు ఫోన్‌ని సౌకర్యవంతంగా ఆపరేట్ చేసుకోవచ్చు.. ఇలా కాకుండా 45-75 లో కూడా ఫోన్ ను ఉంచుకోవచ్చు.. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్ ఛార్జింగ్ ను డౌన్ కాకుండా చూసుకోవాలి..