RCB vs PBKS: ఆర్సీబీకి బిగ్ షాక్.. ఐపీఎల్ ఫైనల్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
- మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2025 ఫైనల్
- ఫైనల్స్‌లో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్
- ఫైనల్‌కు ముందు ఆర్సీబీకి భారీ షాక్
- ఐపీఎల్ ఫైనల్‌కు మ్యాచ్ విన్నర్ దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్ మ్యాచ్ మంగళవారం (జూన్ 3) రాత్రి 7.30కు ఆరంభం కానుంది. మరికొన్ని గంటల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఫైనల్స్‌లో తలపడనున్నాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్‌పై అద్భుత విజయంతో నేరుగా ఫైనల్ చేరిన బెంగళూరు.. ఐపీఎల్ ట్రోఫీ కలను నెరవేర్చుకునేందుకు సిద్ధమైంది. అయితే ఫైనల్‌కు ముందు ఆర్సీబీకి భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఆర్సీబీ బిగ్ మ్యాచ్ విన్నర్, విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడడం లేదని సమాచారం.
ఐపీఎల్ 2025 ఫైనల్ కోసం ఆర్సీబీ సోమవారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. ఈ ప్రాక్టీస్ సెషన్లో ఫిల్ సాల్ట్ కనిపించలేదని కొన్ని జాతీయ మీడియాలు తమ కథనంలో రాసుకొచ్చాయి. సాల్ట్ ప్రాక్టీస్ సెషన్‌కు ఎందుకు హాజరు కాలేదో ఇంకా తెలియరాలేదదు. అయితే సాల్ట్ సతీమణి మొదటి బిడ్డకు జన్మనివ్వనుందని, ఈ సమయంలో ఆమె చెంత ఉండేందుకు ఇంగ్లాండ్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కోచ్ ఆండీ ఫ్లవర్, కెప్టెన్ రజత్ పాటిదార్‌కు విషయం చెప్పి వెళ్ళాడట. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే.. టాస్ వరకు ఆగాల్సిందే. సాల్ట్ అందుబాటులో లేకపోతే.. టిమ్ సీఫర్ట్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.
Also Read
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
ఫిల్ సాల్ట్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లలో 387 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. క్వాలిఫయర్-1లో సాల్ట్ పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఓ ఆటాడుకున్నా విషయం తెలిసిందే. సాల్ట్ దూరమైతే ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి. విరాట్ కోహ్లీ కూడా ఒత్తిడిలో పడే అవకాశాలు లేకపోలేదు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హిట్టర్ టిమ్ డేవిడ్ సైతం ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా తెలియరాలేదు. ఫైనల్ మ్యాచ్‌కు డేవిడ్ కూడా దూరం కానున్నట్లు సమాచారం. ఎస్ఆర్హెచ్తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా డేవిడ్ గాయపడ్డాడు.
తాజావార్తలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
-
Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
-
Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
-
IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!