Dolo 650: కరోనా వైరస్ వ్యాప్తి నుంచి డోలో 650ఇంటిలో ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ప్రతి ఇంట్లో ఏం లేకున్నా డోలో షీట్ ఉండాల్సిందే. ఏ చిన్న బాధ అనిపించిన సర్వరోగ నివారిణి అన్నట్లు డోలో 650మందు మింగేస్తున్నాం. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి డోలోనే ప్రతి రోగానికి పరిష్కారంలా మారిపోయింది. కారణం డాక్టర్లు కూడా జర్వం వస్తే ముందు రాసే మందు డోలో 650. మార్కెట్లో మరెన్నో కంపెనీలు ఉన్నా ఫస్ట్ ప్రిపరెన్స్ మాత్రం డోలోకే.
Read Also: Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణలోనూ 3 రోజులు మద్యం షాపులు బంద్
ఈ మధ్య డోలో 650 మాత్రలను సిఫారసు చేసినందుకు గాను వైద్యులకు మైక్రోల్యాబ్స్ పెద్ద మొత్తంలో ప్రోత్సాహకాలు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. రూ.1,000 కోట్ల వరకు తాయిలాలు ఇచ్చిందన్న వార్తలు రాగా, అసలు డోలో 650 విక్రయాలే అన్ని లేవని మైక్రోల్యాబ్స్ ఖండించింది. దీనిపై డోలో 650 (ప్యారాసెటమాల్) తయారీ సంస్థ, బెంగళూరుకు చెందిన మైక్రోల్యాబ్స్ కు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలియన్స్ (ఐపీఏ) క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై ఒక నివేదికను డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీకి ఐపీఏ సమర్పించింది. ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ విధానాల మార్గదర్శకాలను మైక్రోల్యాబ్స్ అనుసరించినట్టు తన నివేదికలో ఐపీఏ తెలిపింది. అనైతిక, తప్పుడు విధానాలను అనుసరించిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవని తేల్చి చెప్పింది.
Read Also: Beer can Treat Kidney Stones: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు మాయం..! సర్వేలో ఆసక్తికర అంశాలు..
కానీ, డోలో మాత్రలను అధికంగా తీసుకున్న వారిలో గుండె పోటు, నరాల బలహీనత, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, మతిమరుపు వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే వీటి వాడకం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.