Site icon NTV Telugu

Petrol Dealers strike: పెట్రోల్ డీలర్స్ ఆందోళన.. 48 గంటలు బంకులు క్లోజ్

Rj

Rj

పెట్రోల్ బంకుల బంద్‌కు (Rajasthan Petrol Dealers strike) రాజస్థాన్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఆదివారం రాజస్థాన్ అంతటా పెట్రోల్ పంపులు మూసివేయబడతాయని వెల్లడించారు.

రాజస్థాన్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ కోశాధికారి సందీప్ బగేరియా మాట్లాడుతూ.. 48 గంటల పాటు రాజస్థాన్‌లో సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 48 గంటల పాటు ఈ సమ్మె జరగనుందని పేర్కొన్నారు. కొనుగోలు.. అమ్మకాలు రెండు నిలిచిపోతాయని చెప్పుకొచ్చారు.

పెట్రోల్ ధరలను తగ్గిస్తామని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ధరలు మాత్రం తగ్గలేదన్నారు. 33 శాతం మంది డీలర్లు మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా వ్యాట్ ఉందని.. ఇతర రాష్ట్రాల్లోని ధరలతో సమానంగా పెట్రోల్ ధరలను తగ్గించాల్సి అవసరం ఉందని డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో పెట్రోల్ ధరలపై వ్యాట్‌ను పెంచిందని.. ప్రస్తుత పరిస్థితులను బట్టి దాన్ని సవరించాలని సందీప్ బగేరియా డిమాండ్ చేశారు. ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు.

 

Exit mobile version