Peru Bus Accident Today: దక్షిణ అమెరికా దేశమైన ఆగ్నేయ పెరూలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు కొండపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 25 మంది చనిపోగా.. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని పెరూ అధికార వర్గాలు వెల్లడించాయి.
ఆండెస్ పర్వతాల మీదుగా హుయాన్యాయో నుంచి హువాంటా వెళ్తుతుండగా.. అదుపు తప్పిన బస్సు ఒక్కసారిగా 200 మీటర్ల (656 అడుగుల) లోతులో ఉన్న లోయలో పడింది. దీంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 25 మంది చనిపోగా.. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి జార్జ్ చావెజ్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Also Read: Vijay Antony Daughter: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య!
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. గత నెలలో ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెరూలో సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడం, హైవేల మీద అతివేగం, ట్రాఫిక్ నియమాలను సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరగడం సర్వసాధారణమైంది. రాత్రిపూట, పర్వతాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.