Perplexity Chrome deal: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ను కొనేందుకు ఓ స్టార్టప్ కంపెనీ ఆసక్తి కనబరుస్తుంది. అక్షరాల 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే ఈ మొత్తం ఆ స్టార్టప్ కంపెనీకి మొత్తం విలువ కంటే ఎక్కువ. అసలు ఇంతకీ ఆ స్టార్టప్ కంపెనీ ఏంటి.. దాని కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: Tourist Police: తెలంగాణలో పర్యాటక పోలీసులు.. మొదటి దశలో 80 మంది!
పర్‌ప్లెక్సిటీ..
పర్‌ప్లెక్సిటీ అనేది ఓ స్టార్టప్ కంపెనీ. అరవింద్ శ్రీనివాస్ నేతృత్వంలోని ఈ కంపెనీ ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ను కొనేందుకు ఆసక్తి కనబరుస్తుంది. ఈ కంపెనీ గూగుల్‌కు మొత్తం 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే ఈ మొత్తం పర్‌ప్లెక్సిటీ కంపెనీ మొత్తం విలువ కంటే ఎక్కువ. గూగుల్ క్రోమ్‌ను విక్రయించాలని అమెరికా ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తోన్న నేపథ్యంలో పరెక్సిటీ నుంచి ఈ భారీ ఆఫర్ రావడం గమనార్హం. బ్రౌజర్ విషయంలో గుత్తాధిపత్యం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
ఈ ఆఫర్‌ను పర్‌ప్లెక్సిటీ ‘టెక్ క్రంచ్’కు ఇచ్చిన ప్రకటనలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. క్రోమ్ కోర్ ఇంజిన్ అయిన క్రోమియంను ఓపెన్ సోర్స్‌గా కొనసాగిస్తాయని, ఏటా సుమారు 3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతాయని హామీ పేర్కొంది. ఒకవేళ డీల్ విజయవంతమైతే పర్‌ప్లెక్సిటీని వినియోగదారుల డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా మార్చబోమని, గూగూల్ క్రోమ్‌నే కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
ఈ డీల్‌ను పూర్తి చేసేందుకు పర్‌ప్లెక్సిటీ బయటి పెట్టుబడిదారుల సాయం తీసుకోనున్నట్లు బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో పేర్కొంది. బహుళ పెట్టుబడిదారులు ఈ లావాదేవీకి పూర్తిగా ఫైనాన్స్ చేయడానికి అంగీకరించారని కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ దిమిత్రి షెవెలెంకో తెలిపారు. కంపెనీ జులైలో 100 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఆ ఫండింగ్ రౌండ్లో కంపెనీ మొత్తం విలువ సుమారు రూ.1.57 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఆ లెక్కన చూస్తే కంపెనీ విలువ కంటే గూగుల్ క్రోమ్‌కు ఆఫర్ చేసిన మొత్తం దాదాపు డబుల్ అనే చెప్పాలి.
పర్‌ప్లెక్సిటీ కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే సెర్చ్ ఇంజిన్. ఇదో చాటీజీపీటీ తరహా యాప్. ఇది కామెట్ పేరుతో బ్రౌజర్ సేవలందిస్తోంది. ఈ బ్రౌజర్ పది కోట్ల నుంచి వందల కోట్ల యూజర్లను చేరుకోవాలని 2026 నాటికి లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం స్మార్ట్‌ఫోన్ తయారీదారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గూగుల్ క్రోమ్‌ను విక్రయించాలన్న ప్రణాళికలపై ఇప్పటికీ స్పష్టత లేదు. శాంసంగ్, యాపిల్ సహా బడా కంపెనీలతో గూగుల్ ఒప్పందాలు చేసుకుందని, తర్వాత ఆయా డివైజ్లో గూగుల్ సెర్చ్ డిఫాల్ట్ ఉండేలా వారికి చెల్లింపులు చేసిందని ఆరోపిస్తూ అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ సహా అక్కడి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించాయి. గూగుల్ విధానాలు చట్టవిరుద్ధమని అవి కోర్టుకు సమర్పించిన వ్యాజ్యంలో పేర్కొన్నాయి. బ్రౌజర్ విషయంలో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు యత్నించిందని వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టు తేల్చింది.
READ MORE: Putin safe in Alaska: అలస్కాకు పుతిన్.. అక్కడ ఆయన సేఫేనా?
