Site icon NTV Telugu

Perplexity CEO: ఈ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయొద్దు.. పెర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ హెచ్చరిక

Perplexity Ceo

Perplexity Ceo

పెర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను హెచ్చరించారు. సోషల్ మీడియా వేదిక ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేసి, మీ బ్యాంక్ ఖాతాను కూడా ఖాళీ చేయగల నకిలీ యాప్‌కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పోస్ట్‌లో, అరవింద్ శ్రీనివాస్ ఇలా రాసుకొచ్చారు.. “ప్రస్తుతం iOS యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న కామెట్ యాప్ నకిలీది. స్పామ్. ఈ యాప్ పెర్ప్లెక్సిటీ నుండి వచ్చింది కాదు. AI స్టార్టప్ యాప్‌ను విడుదల చేసినప్పుడు లేదా ప్రీ-రిజిస్ట్రేషన్‌కు అందుబాటులో ఉంచినప్పుడు మీకు నేరుగా తెలియజేయజేస్తాము.” అని స్పష్టం చేశాడు. కామెట్ యాప్ సఫారీకి మొదటి నిజమైన పోటీని అందిస్తుందని అరవింద్ శ్రీనివాస్ ఇప్పటికే చెప్పారు. ఇది ముఖ్యంగా ఐఫోన్ బ్రౌజర్. ఈ నెల ప్రారంభంలో కామెట్ iOS వెర్షన్‌పై పనిచేస్తున్నట్లు పెర్ప్లెక్సిటీ ప్రకటించింది. ఈ యాప్ ఇప్పటికే ఆండ్రాయిడ్‌లో విజయవంతమైందని కంపెనీ పేర్కొంది.

Also Read:Guntur Train Incident : పెదకూరపాడు రైలులో అ*త్యాచారం నిందితుడు అరెస్ట్‌ !

ఆపిల్ తన ఐఫోన్ వినియోగదారులకు డిఫాల్ట్‌గా సఫారీని అందిస్తుంది. అయితే, కామెట్ యాప్ ఐఫోన్ వినియోగదారులకు కొత్త ఆప్షన్స్ ను అందిస్తుందని అరవింద్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఈ యాప్ బ్రౌజింగ్‌ను మరింత ఇన్నోవేటివ్ గా చేస్తుంది. యూజర్లు సెర్చ్ రిజల్ట్స్ ను మరింత సులభంగా, తక్కువ సమయంలో యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. స్పామ్ యాప్‌లు ప్రైవసీ, మొబైల్ డేటాకు ప్రమాదకరం. అవి బ్యాంక్ ఖాతాలను కూడా హ్యాక్ చేస్తాయి. OTP లను యాక్సెస్ చేయగలవు. ఇంకా, అవి మీ ఫోన్‌లోని యాప్‌ల లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్‌లను చోరీ చేస్తాయి.

Exit mobile version