Perni Nani Quash Petition: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అవమానకరంగా దూషించారనే ఆరోపణలతో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, పిటిషనర్‌పై నమోదైన కేసులన్నీ ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవేనని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ సందర్భంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు జారీ చేసి విచారణ కొనసాగించాలంటూ పేర్కొంది. ఇక కేసు తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
Read Also: YS Jagan: మన గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర.. గట్టిగా గొంతెత్తాలి..
