NTV Telugu Site icon

Kalki 2898 AD : బుజ్జి ఈవెంట్ కి పర్మిషన్స్ టెన్షన్.. చివరి నిముషంలో..?

Bujji Event

Bujji Event

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ మూవీ “కల్కి 2898 AD “.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారు.వైజయంతి మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.దీనితో మేకర్స్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు.ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపిస్తున్నాడు.అయితే ఈ సినిమాలో భైరవకు ఓక మిత్రుడు ఉంటాడు.తానే “బుజ్జి”..అస్సలు బుజ్జి ఎవరంటే ఈ సినిమాలో భైరవ వాడే కార్ పేరు.ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం భైరవకు బుజ్జి సహాయ పడుతుంది.ఈ బుజ్జికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.ఈ సినిమాలో బుజ్జి పాత్ర ఎంతో సరదాగా ఉంటుంది అని సమాచారం.ఇదిలా ఉంటే ఈ బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు మేకర్స్ మే 22 న రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసారు .

Read Also :Prabhas :ప్రభాస్ స్టంట్ అంత పర్ఫెక్ట్ గా రావడానికి కారణం ఏంటో తెలుసా?

ఈ ఈవెంట్ లో ప్రభాస్ అభిమానులు భారీగా పాల్గొన్నారు.అభిమానులు ఆశ్చర్య పోయేలా ప్రభాస్ భారీ స్టంట్ తో బుజ్జితో ఎంట్రీ ఇచ్చాడు.ప్రభాస్ మాస్ ఎంట్రీ చూసి అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు.అనంతరం ఈ ఈవెంట్ లో ప్రభాస్ బుజ్జిని పరిచయం చేసాడు.అయితే ఈ ఈవెంట్ ను మరింత మంది అభిమానులు రావడానికి ప్లాన్ చేసారు కానీ పోలీసుల నుండి పర్ఫెక్ట్ పర్మిషన్ రాలేదు.అభిమానుల సంఖ్య తగ్గించమని పోలీసులు ఆదేశాలు ఇవ్వడంతో చిత్ర యూనిట్ పోలీస్ డిపార్ట్మెంట్ తో ఈ రెండు మూడు రోజులు చర్చలు జరిపింది.ఎలక్షన్ కోడ్ నిమిత్తం ఎక్కువ ఫోర్స్ పెట్టలేము కాబట్టి తక్కువ మందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.ఒకానొక సమయంలో జనం లేకుండా ఈ ఈవెంట్ చేసుకోమన్నారు.కానీ చివరికి మినిమం క్రౌడ్ తో కానిచ్చారు.ఈ ఈవెంట్ కు తెలుగు మీడియాతో పాటు ముంబై నుంచి ,బెంగుళూరు నుంచి ,చెన్నై నుంచి కూడా మీడియా వచ్చింది .ప్రస్తుతం ఈ ఈవెంట్ నేషనల్ వైడ్ గా ఎంతో పాపులర్ అయింది .

Show comments