పారిస్ పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నవదీప్ సింగ్.. తన జీవితంలో పడ్డ కష్టాలు, అవమానాల గురించి చెప్పాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. పారాలింపిక్స్ 2024లో జావెలిన్ త్రో F41 విభాగంలో నవదీప్ బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే..
ఇటీవల శుభంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కథను చెప్పాడు. మరుగుజ్జుగా పుట్టిన తనకు తనకు ఎదురైన అవమానాలను తెలిపాడు. జీవితంలో తాను ఏమీ చేయలేనని ప్రజలు అనుకున్నారని, తన వల్ల ఏదీ సాధ్యం కాదని అనుకున్నారని.. కొందరు తనను ఆత్మహత్య చేసుకోమన్నారని వెల్లడించాడు. అలాంటి వారి నుంచే తాను ప్రేరణ పొందానని నవదీప్ తెలిపాడు. తన క్రీడా ప్రయాణం ప్రారంభంలో తన తండ్రి తనకు సహాయం చేశాడని పారా అథ్లెట్ నవదీప్ చెప్పాడు. ఎప్పుడూ తన వెన్నంటే ఉన్నారని తెలిపాడు.
Read Also: Alleti Maheshwar Reddy: సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి
పారిస్ పారాలింపిక్స్‌లో మరుగుజ్జు జావెలిన్ త్రోయర్ నవ్‌దీప్ సింగ్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఎఫ్41 ఈవెంట్‌లో పాల్గొన్న అతడు 47.32 మీటర్ల మేర బల్లెం విసిరి చరిత్ర సృష్టించాడు. స్వర్ణం సాధించి అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తిని మరింత పెంచాడు. అయితే, మొదట నవదీప్ రజతం సాధించాడు. అయితే స్వర్ణం గెలిచిన ఇరాన్‌కు చెందిన సదేగ్‌పై అనూహ్యంగా వేటు పడింది. దీంతో నవ్‌దీప్ సింగ్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.