Site icon NTV Telugu

Pelli Chesukundam Rerelease: వెంకీ మామా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రీరిలీజ్ సిద్ధమైన సూపర్ సినిమా

Pelli Chesukundam

Pelli Chesukundam

Pelli Chesukundam Rerelease: తెలుగు చిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందరు సినిమా హీరోలు అభిమానులు, వెంకీ మామా సినిమాలకు అభిమానులుగా ఉంటారు. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ వెంకీ మామా. విక్టరీ వెంకటేష్‌కు సూపర్ జోడీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సౌందర్య. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. తాజాగా వీళ్లిద్దరి కాంబో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం “పెళ్లి చేసుకుందాం” సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

READ ALSO: Fire-Boltt ONYX: క్రేజీ ఆఫర్ బ్రో.. రూ. 21000ల ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ కేవలం రూ. 1499కే.. అమోల్డ్ డిస్ప్లేతో

డిసెంబర్ 13న విక్టరీ వెంకటేష్ జన్మదిన కానుకగా ఈ సూపర్ హిట్ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో 4K రిజల్యూషన్‌లో రీ-రిలీజ్ చేయడానికి సాయిలక్ష్మీ ఫిల్మ్స్ సిద్ధమైంది. వెంకీమామా కెరీర్‌లో అసాధారణ విజయం సాధించిన చిత్రాలలో ఇదొకటి. ఈ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. సి.వెంకట్రాజు, శివరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను సాయిలక్ష్మీ ఫిల్మ్స్ పతాకంపై వరప్రసాద్ రీరిలీజ్ చేస్తున్నారు.

READ ALSO: BrahMos Deal: బ్రహ్మోస్ కొనుగోలుకు సిద్ధమవుతున్న అతిపెద్ద ముస్లిం దేశం ..

Exit mobile version