Site icon NTV Telugu

Peddi Sudarshan Reddy : నేను అక్కడ ఉండుంటే.. బట్టలు ఉడదీసి కొట్టేవాణ్ని

Peddi Sudharshan Reddy

Peddi Sudharshan Reddy

Peddi Sudarshan Reddy : హన్మకొండ జిల్లా అధికారులపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న BRS సభకు వచ్చే వాహనాలను అడ్డుకున్న RTO అధికారులు తీరు సిగ్గు మాలిన చర్య అని ఆయన ఆరోపించారు. నా లాంటి వాడు అక్కడ ఉంటే బట్టలు ఉడా తీసి కొట్టేవాణ్ని అని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రవర్తించారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తొత్తు లాగా పోలీసులు వ్యవహరించారని ఆయన మండిపడ్డారు, ప్రజలను కావాలనే భారీకేట్లు పెట్టి అడ్డుకున్నారని, నిన్న బీఆర్ఎస్ సభ వద్ద పోలీసులు అసలు డ్యూటీనే చేయలేదన్నారు పెద్ది సుదర్శన్‌ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ సభకు సహకరిస్తామని చెప్పి పోలీసులు మా దగ్గర డబ్బులు తీసుకున్నారని, ఒక రాజకీయ పార్టీ నుండి మొట్టమొదటిసారిగా డబ్బులు తీసుకున్న చరిత్ర పోలీసులకే దక్కుతుందని తీవ్రంగా ఆరోపించారు. పోలీసులు కుట్రపూరితంగా సభను చెడగొట్టే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు.

Health Tips: రుచికి తీపిగా ఉన్నప్పటికీ.. మధుమేహ రోగులకు ఈ పండ్లు బెస్ట్ ఆప్షన్

Exit mobile version