NTV Telugu Site icon

Viral Video : ఓరి నాయనో.. ఏంది సామి ఈ విచిత్రం.. డైనోసార్ కజిన్లా ఉందే..

Peocock

Peocock

మన జాతీయ పక్షి అంటే నెమలి.. నెమలి ఎంతో అందమైన పక్షి అందుకే దాన్ని చూడాలంటే రెండు కళ్లు చాలవు.. అయితే నెమలి అందంగా నాట్యం చెయ్యడం మనం చూసే ఉంటాము.. కానీ నోట్లో నుంచి నిప్పులు చెరగడం ఎప్పుడైనా చూశారా.. బహుశా విని ఉండరు.. ఇప్పుడు మనం చెప్పుకొనే నెమలి మాత్రం అరుస్తూ నిప్పులు చేరుగుతుంది.. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఏంటి.. ఇదంతా నిజమా అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది.. చూసింది నిజమే.. వర్షాకాలంలో నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంటే ఆ సొగసు చూడతరమా అనిపిస్తుంది. అంతటి సౌందర్య దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. అలాంటి అందమైన నెమలి.. ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా..? అవును మీరు విన్నది నిజమే.. ఇప్పుడు నెమలి నోటి వెంట నిప్పులు కురిపిస్తున్న వీడియో పోస్ట్ నెట్టింట ట్రెండ్ అవుతుంది..

అది చూసిన నెటిజన్లు సైతం భయంతో వణికిపోతున్నారు. ల్లో, కార్టూన్ల షోలలో డ్రాగన్‌లు, డైనోసార్‌ల వంటి జంతువుల నోటి నుంచి నిప్పులు చిమ్మటం చూస్తుంటాం. అలాంటిది ఇక్కడ నెమలి నోటి నుంచి నిప్పులు చిమ్ముతున్న దృశ్యం అందరిని షాక్ కు గురి చేస్తుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో నెమలి పైకి చూస్తూ బిగ్గరగా అరుస్తుంది. దాని నోటి నుండి మంటలు వస్తున్నాయి. కానీ, నెమలి నిజానికి కక్కటం లేదు. అది అరుస్తున్నప్పుడు సూర్యకాంతి వల్ల ఇలాంటి దృశ్యం ఆవిష్కృతం అయింది. ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. అందులో కనిపించే నెమలి చాలా చలి ప్రదేశంలో ఉన్నట్లుంది.అందులో సూర్యుని కాంతి ఎర్రటి నిప్పులా కనిపిస్తుంది.. వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు..