Site icon NTV Telugu

PD Act on Angur Bhai: గంజాయి లేడీ డాన్ అంగూర్ భాయ్‌కి హైకోర్టులో చుక్కెదురు.. పీడీ యాక్ట్‌పై పిటిషన్ కొట్టివేత!

Pd Act On Angur Bhai

Pd Act On Angur Bhai

PD Act on Angur Bhai: హైదరాబాద్ లోని దూల్‌పేట కేంద్రంగా హైదరాబాద్‌ నగరంలో గంజాయి వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లేడీ డాన్ అరుణ్ బాయ్ అలియాస్ అంగూర్ భాయ్ కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై పెట్టిన పీడీ యాక్ట్‌ (PD Act)ను సవాలు చేస్తూ అంగూర్ భాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

Nara Lokesh: దూసుకొస్తున్న ‘మొంథా’ తుఫాన్.. నిరంతర పర్యవేక్షణ, హై-లెవల్ సన్నాహాలు జరుగుతున్నాయి..!

అంగూర్ భాయ్‌పై ఎక్సైజ్ శాఖ ఎస్టీఎఫ్ఏ టీం లీడర్ అంజిరెడ్డి, దూల్‌పేట ఎక్సైజ్ సీఐ మధుబాబు సిబ్బందితో కలిసి అంగూర్ భాయ్‌పై పీడీ యాక్ట్ పెట్టాలని ప్రతిపాదించారు. ఆమెపై పలు గంజాయి కేసులు ఉండటమే ఈ ప్రతిపాదనకు ప్రధాన కారణం. దీనితో ప్రభుత్వం నియమించిన అడ్వైజరీ బోర్డు ఈ ప్రతిపాదనలను పరిశీలించి, 2025 మార్చి 10న పీడీ యాక్ట్ అమలుకు సిఫారసు చేసింది. ఈ సిఫారసుల మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, 2025 ఏప్రిల్ 15న అంగూర్ భాయ్‌పై పీడీ యాక్ట్‌ను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కలెక్టర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ అంగూర్ భాయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు మౌసమి భట్టాచార్య, గాడి ప్రవీణ్ కుమార్ వాదనలు విన్నారు.

BSNL: బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగాలు.. నెలకు రూ. 50000 శాలరీ..

ప్రభుత్వం తరఫున స్పెషల్ ప్లీడర్ స్వరూప్ ఒరిలా, అసిస్టెంట్ లీడర్ రవి కుమార్ వాదనలు వినిపిస్తూ.. అంగూర్ భాయ్‌పై పీడీ యాక్ట్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు అంగూర్ భాయ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తుది తీర్పునిచ్చారు. హైకోర్టులో పిటిషన్ కొట్టివేయడంపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ డైరెక్టర్ షాన్వాస్ ఖాసిం హర్షం వ్యక్తం చేస్తూ.. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎక్సైజ్ సిబ్బందిని అభినందించారు.

Exit mobile version