వన్డే ప్రపంచకప్ కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (మంగళవారం) రిలీజ్ చేసింది. కాగా పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను దక్షిణాది నగరాల్లో ఆడనుండగా.. ఒక్క టీమిండియాతో మాత్రమే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడనుంది. అయితే చెన్నై, కోల్‌కతాల్లో తాము ఆడలేమని.. ఈ రెండు వేదికలను మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి అభ్యర్థన పెట్టుకున్నప్పటికి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.
Read Also: Rahul Gandhi: జూన్ 29న మణిపూర్ పర్యటనకు రాహుల్‌గాంధీ
అయితే, తాజాగా పీసీబీకి మరో చిక్కు వచ్చి పడింది. అదేంటంటే భారత్‌లో ఏ టోర్నీ జరిగినా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తప్పనిసరి ఇవ్వాల్సిందే. ఇదే విషయమై పీసీబీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ లో పాల్గొనేందుకు మాకు ప్రభుత్వం నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు అని పేర్కొన్నాడు. ఈ విషయమై మా ప్రభుత్వంతో చర్చలు జరిపాం.. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాగానే ఈవెంట్ నిర్వహించే ఐసీసీకి సమచారం అందిస్తామని తెలిపారు.
Read Also: ITBP Recruitment: పదోతరగతి అర్హతతో ఉద్యోగాలు..458 పోస్టులకు దరఖాస్తులు..
అయితే వరల్డ్‌కప్‌కు మేము ఆడబోయే మ్యాచ్‌ల్లో రెండు వేదికలను మార్చాలని పెట్టుకున్న ప్రతిపాదనను ఐసీసీ, బీసీసీఐ పెద్దగా పట్టించుకోలేదు అని పాక్ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని మా ప్రభుత్వం ఎలా తీసుకుంటున్నది మాత్రం ఇంకా తెలియదు అని చెప్పుకొచ్చాడు.
Read Also: బ్లాక్ గౌన్ లో రీతూ చౌదరి టాప్ గ్లామర్ షో
కాగా.. పాక్ ప్రభుత్వం నుంచి పీసీబీకి ప్రపంచకప్ ఆడేందుకు క్లియరెన్స్ రాకపోతే బోర్డు చాలా నష్టపోవాల్సి వస్తోంది. పాక్ జట్టు వరల్డ్‌కప్‌లో ఆడకుంటే కోట్ల రూపాయలను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇది పాక్ క్రికెట్‌కు అంత మంచిది కాదు.. ఈ లెక్కన చూసుకుంటే ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చేందుకే మొగ్గుచూపే ఛాన్స్ ఉంది. ఇక అభిమానులు మాత్రం ఆడకపోతే ఐసీసీకి వచ్చే నష్టం ఏమి ఉండదు.. పీసీబీకే పెద్ద నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది అని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
