Site icon NTV Telugu

PCB financial Crisis: భారత్‌తో మ్యాచ్‌ రద్దైతే.. పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డుకు ఎన్ని వందల కోట్ల నష్టమో తెలుసా?

Pcb

Pcb

PCB financial Crisis: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు గడ్డుకాలం ఎదురవ్వనుంది. తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం.. ఆర్థికంగా పీసీబీని పెద్ద సంక్షోభంలోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పీసీబీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఒక్క నిర్ణయం వల్లే పాకిస్థాన్ క్రికెట్‌కు వచ్చే డబ్బు నిలిపివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐసీసీకి సంబంధించిన నాలుగేళ్ల ఆదాయ చక్రంలో పీసీబీకి 5.75 శాతం వాటా ఉంది. ఈ వాటా ద్వారా పాకిస్థాన్‌కు ఏటా సుమారు 3.45 కోట్ల డాలర్లు, అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.285 నుంచి 290 కోట్ల రూపాయల వరకు వస్తున్నాయి. పీసీబీకి వచ్చే ఆదాయంలో ఇది అత్యంత కీలకమైన వనరు. ఒకవేళ ఐసీసీ ఈ డబ్బును నిలిపివేయడం గానీ, ఫ్రీజ్ చేయడం గానీ చేస్తే.. పీసీబీ ఖజానాకు భారీ షాక్ తగిలినట్లే అవుతుంది.

READ MORE: AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం.. 30కి పైగా అంశాల ఎజెండాతో భేటీ..

2025–26 కాలానికి సంబంధించి పీసీబీ మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.455 నుంచి రూ.458 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. దీంతో ప్రపంచంలోనే టాప్ నాలుగు ధనిక క్రికెట్ బోర్డుల్లో ఒకటిగా కొనసాగుతోంది. అయితే కొన్ని అంచనాలు మాత్రం పీసీబీ విలువ ఇంకా ఎక్కువగా, దాదాపు 1,500 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ద్వారా వచ్చే ఆదాయం, అంతర్జాతీయ ప్రసార హక్కుల నుంచి వచ్చే డబ్బుగా చెబుతున్నారు. తాజాగా భారత్ మ్యాచ్ బహిష్కరణ నిర్ణయం వల్ల పాకిస్థాన్ క్రికెట్‌కు ఉన్న మూడు ప్రధాన ఆదాయ మార్గాలూ ప్రమాదంలో పడినట్లయ్యాయి. మొదటి సమస్య ఏంటంటే.. ఐసీసీ ఏదైనా చర్య తీసుకుని పీసీబీపై శిక్షలు విధిస్తే, ఏటా వచ్చే రూ.280 కోట్లకు పైగా ఆదాయం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇది పీసీబీ రోజువారీ ఖర్చులకూ భారీ దెబ్బ తగులుతుంది.

READ MORE: US Tariffs: పాకిస్థాన్‌కు ట్రంప్ బిగ్ షాక్! టారిఫ్ అంశంలో సీన్ రివర్స్.. భారత్‌కు లాభం, పాక్‌కు నష్టం

రెండో సమస్య ద్వైపాక్షిక సిరీస్‌లు. ఇప్పటికే పాకిస్థాన్, భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో పోలిస్తే తక్కువ హై-విలువ సిరీస్‌లే ఆడుతోంది. ఇప్పుడు ఈ వివాదం కారణంగా ఇతర క్రికెట్ బోర్డులు దూరంగా ఉంటే, పాకిస్థాన్ అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ మరింత తగ్గిపోతుంది. దాంతో టీవీ హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు తగ్గి వందల కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. మూడోది, పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు అతి పెద్ద దెబ్బ తగులుతుంది. పీఎస్ఎల్ పీసీబీకి ప్రధాన ఆదాయ వనరు. ఈ లీగ్ ద్వారా సుమారు 5 బిలియన్ రూపాయల ఆదాయం వస్తోంది. కానీ ఐసీసీ సంబంధిత సమస్యలు తలెత్తి, విదేశీ ఆటగాళ్లకు అనుమతులు రాకపోతే.. పీఎస్ఎల్‌లో స్టార్ ఆటగాళ్లే కనిపించరు. అప్పుడు లీగ్ ఆకర్షణ తగ్గుతుంది. స్పాన్సర్లు వెనక్కి తగ్గుతారు. టీవీ హక్కుల విలువ పడిపోతుంది. స్టేడియాల్లో ప్రేక్షకుల సంఖ్య సైతం తగ్గుతుంది. ఇవన్నీ కలిపి పీసీబీకి భారీ నష్టాన్ని మిగులుస్తాయి. మొత్తంగా చూస్తే, భారత్ మ్యాచ్‌ను బహిష్కరించడం ఒక రాజకీయ నిర్ణయంలా కనిపించినా, దాని ప్రభావం మాత్రం నేరుగా పాకిస్థాన్ క్రికెట్ ఖజానాపై పడుతోంది.

Exit mobile version