Site icon NTV Telugu

PBKS vs MI: ముంబైని కొట్టి.. క్వాలిఫయర్‌ అవకాశాన్ని అందుకున్న పంజాబ్!

Punjab Kings

Punjab Kings

పదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన పంజాబ్‌ కింగ్స్‌.. నేరుగా క్వాలిఫయర్‌ ఆడే అవకాశాన్నీ ఒడిసిపట్టింది. రెండో దశలో వరుస విజయాలతో దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన పంజాబ్‌.. 19 పాయింట్లతో పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టుకు ఫైనల్‌ చేరడానికి క్వాలిఫయర్‌-2 రూపంలో మరో అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పంజాబ్‌కు ఫైనల్ చేరేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. పంజాబ్‌పై ఓడిన ముంబై 16 పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమితం అయింది. ఇక ఎలిమినేటర్‌లో ముంబై ఆడాల్సి ఉంది.

పంజాబ్‌ కింగ్స్‌ తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. సోమవారం జైపుర్‌ వేదికగా మ్యాచ్‌లో 185 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ 18.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. జోష్‌ ఇంగ్లిస్‌ (73; 42 బంతుల్లో 9×4, 3×6), ప్రియాంశ్‌ ఆర్య (62; 35 బంతుల్లో 9×4, 2×6) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ముందుగా బ్యాటన్గ్ చేసిన ముంబై 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (57; 39 బంతుల్లో 6×4, 2×6) రాణించాడు. జోష్‌ ఇంగ్లిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Exit mobile version