Site icon NTV Telugu

PBKS vs CSK: సెంచరీతో శివాలెత్తిన ప్రియన్స్ ఆర్య.. చెన్నై టార్గెట్ ఎంతంటే?

Pbks Vs Csk (1)

Pbks Vs Csk (1)

PBKS vs CSK: మొహాలీ వేదికగా నేడు పంజాబ్ కింగ్స్ (PBKS), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దానితో బ్యాటింగ్ మొదలు పెట్టిన పంజాబ్ పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ చివరకు అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ కింగ్స్ మొదట్లో వికెట్లు వరుసగా పడిపోతున్న, కానీ వారి రన్ రేట్‌లో ఎటువంటి తగ్గుదల కనిపించలేదు. దీనితో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 219 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఇక ఈ ఇన్నింగ్స్ లో పంజాబ్ యువ బ్యాట్స్‌మన్ ప్రియాంశ్ ఆర్య అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కేవలం 42 బంతుల్లోనే 7 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 103 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ ను అందించాడు. ఇకపోతే, మొదటి వికెట్ త్వరగా కోల్పోయిన పంజాబ్ జట్టు మధ్యలో కొన్ని వికెట్లు త్వరగా కోల్పోయింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0), శ్రేయాస్ అయ్యర్ (9), మార్కస్ స్టోయినిస్ (4), నేహాల్ వద్ఘేరా (9), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (1) లు నిరాశపరిచినా… చివర్లో శశాంక్ సింగ్ 52 నాటౌట్, మార్కో జాన్సెన్ 34 నాటౌట్ కీలక భాగస్వామ్యంతో జట్టును 219 పరుగుల వరకు చేర్చారు.

ఇక CSK బౌలింగ్ విషయానికి వస్తే.. చెన్నై బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఖలీల్ అహ్మద్, అశ్విన్ చెరో 2 కీలక వికెట్లు తిసినా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. జడేజా మాత్రం కాస్త నియంత్రిత బౌలింగ్ చేశాడు. పథిరానా అత్యధికంగా 52 పరుగులు ఇచ్చి వికెట్ సాధించలేకపోయాడు. చుడాలిమరి చెన్నై జట్టు ఛేదనలో ఎలా ఆడుతుందో.

Exit mobile version