ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-27లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడుతోంది. ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవాలంటే 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.
READ MORE: Father Suicide: కూతురి ప్రేమ పెళ్లితో తండ్రి ఆత్మహత్య.. “బిడ్డను ఎలా చంపగలను” అంటూ సూసైడ్ లెటర్..
ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో, మార్కస్ స్టోయినిస్ కూడా షమీ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (82) చెలరేగాడు. గత మ్యాచ్‌లో సెంచరీతో రెచ్చి పోయిన ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (36) అదే జోరును కొనసాగించాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (42)తో అదరగొట్టాడు. చివర్లో స్టాయినిస్ (34) హైదరాబాద్ బౌలర్లకు చుక్కులు చూయించాడు. అనంతరం నేహల్ వధేరా (27), శశాంక్ సింగ్ (2), మ్యాక్స్‌వెల్ (3) రన్స్ సాధించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు తీశాడు. ఇషాన్ మలింగ 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో అద్భుతమైన విజయం సాధించింది. కానీ దీని తర్వాత, హైదరాబాద్ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచింది. ఇప్పుడు ఈ మ్యాచ్ గెలవడం హైదరాబాద్‌కు అవసరం.