Site icon NTV Telugu

Priyansh Arya: ప్రియాంశ్ ఆర్య 8 బంతులే ఆడాడు.. పంజాబ్ కోచ్ ఆసక్తికర విశేషాలు!

Priyansh Arya Pbks

Priyansh Arya Pbks

ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 39 బంతుల్లో శతకం బాధగా.. మొత్తంగా 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 103 చేశాడు. ప్రియాంశ్ చెలరేగడంతో పంజాబ్ భారీ స్కోర్ చేసి.. విజయం సాధించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రియాంశ్ హాట్‌ టాపిక్‌ అయ్యాడు. ఎవరిని కదిలించినా.. ప్రియాంశ్ గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా ప్రియాంశ్ గురించి పంజాబ్ కింగ్స్ సహాయక కోచ్ బ్రాడ్ హడిన్ ఆసక్తికర విశేషాలు వెల్లడించాడు.

Also Read: IPL 2025: ఊసరవెల్లి అంటూ.. లైవ్ టీవీలో సిద్ధూ, రాయుడు గొడవ!

ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు కేవలం 8 బంతులే ప్రాక్టీస్ మ్యాచ్‌లో ప్రియాంశ్ ఆర్య ఆడాడని బ్రాడ్ హడిన్ తెలిపాడు. ‘ఐపీఎల్‌ 2025 ఆరంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. కేవలం 8 బంతులే ప్రియాంశ్ ఆడాడు. అతడి ఆట తీరును చూశాక తప్పక అవకాశం ఇవ్వాలని మాకు అనిపించింది. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లోనే ప్రియాంశ్ ఆకట్టుకున్నాడు. చెన్నైపై మెరుపు శతకం బాదాడు’ అని హడిన్ ప్రశంసించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన శతకం చేసిన నాలుగో ప్లేయర్‌గా అతడు రికార్డుల్లో నిలిచాడు. అంతేకాదు అత్యంత వేగవంతమైన సెంచరీని బాదిన అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ప్రియాంశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Exit mobile version